గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సినీ నటుడు నందమూరి తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తారకరత్న ఆరోగ్యంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. ”సోదరుడు తారకరత్న(Taraka Ratna) త్వరగా కోలుకుంటున్నారు. ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ.. ఈ పరిస్థితి నుంచి అతడిని కాపాడిన డాక్టర్లకు, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. నువ్వు దీర్ఘాయుషుతో ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను డియర్ తారకరత్న” అంటూ ట్వీట్ చేశారు..