- సబ్సిడీలు లేదా రాయితీలు లేదా ప్రోత్సాహకాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ఇచ్చే సబ్సిడీ, రాయితీలు లేదా ప్రోత్సాహకాలు వల్ల దేశానికి ఎలాంటి నష్టం వాటిల్లదు.పాలన చేయలేని, సంపదను సృష్టించలేని ప్రభుత్వాలే వీటిపై రాద్ధాంతం చేస్తున్నారు. ఇది వాస్తవం. పెద్ద పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దేశానికి ముప్పు వాటిల్లుతుంది, అలాగే సంపద అంతా కొద్ది మంది చేతుల్లో ఉండటం వల్ల దేశానికి అపద కలిగేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటుంది
ఉదాహరణకు, బడా పారిశ్రామిక సంస్థల అధినేత బ్యాంకులకు చెల్లించవలసి ఋణాలు ఎగురవేసి ఇతర దేశాల్లో వారి కార్యకలాపాలను ప్రారంభించరు.వారిని దేశానికి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం తలకిందులుగా తపస్సు చేసినా, ప్రయోజనం శూన్యం .ఈ పెద్ద పెద్ద పరిశ్రమలకు అధిక శాతం ఆధిపత్యం కులాల వారిగా ఉండటం, వారు రాజకీయ పార్టీల అండదండలు పుష్కలంగా ఉంటుంది. అందువల్ల వారు దేశాన్ని వదలి వేళ్లిపోవడానికి అన్ని రకాలుగా రాజకీయ నాయకులు, అధికారులు సహయ సహకారాలు అందజేస్తున్నారు.
దేశం అంటే మట్టి కాదు. దేశం అంటే మనుషులొయి అన్న సత్యాన్ని గ్రహించాలి, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దేశాభివృద్ధి అంటే ప్రజల ఆర్థికాభివృద్ధి అని ఈ ప్రభుత్వాలు గ్రహించాలి.రాష్ట్ర, కేంద్ర బడ్జెట్లో నిధులు అధిక శాతం యం. యస్. పి. లకు కేటాయించాలి. సబ్సిడీలు లేదా రాయితీలు ఇవ్వటం వల్ల ఎలాంటి నష్టం ప్రభుత్వానికి, వాటేల్లదు.
చిన్న పారిశ్రామికవేత్తలు, దేశాన్ని వదలి వేళ్లిపొరు. బ్యాంకు ఋణాలు ఎగురవేయరు. నిదానముగా అయినా పూర్తిగా ఋణాన్ని తీర్చే స్తున్నారు. వీరికి ఎలాంటి రాజకీయ, అధికారుల పలుకు బడి ఉండదు. అంతేకాదు వీరు పరువూ, ప్రతిష్ఠ, మర్యాదలతో బ్రతికే దేశ భక్తి గలవారు. జన్మభూమి రుణం – మాతృమూర్తి ఋణం తీర్చు తరుణం కోసం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం చేసినప్పుడే, ఆర్థికంగా అభివృద్ధి చెంది, బలమైన శక్తి సామర్థ్యాలు గల దేశంగా పరిగణిస్తారు.కేవలం, నా కులం, మతం, ప్రాంతం, జాతి అనుకోని విచక్షణ చూపించడం వల్ల దేశానికి ప్రమాద ఏర్పడుతుంది.
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు, స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం చేసే పథకాల నిధులను, సబ్ ప్లాన్ నిధులను మళ్లించి, ఎస్సీ ఎస్టీ ప్రజలు అభివృద్ధికి తోడ్పడే పథకాలను నిలిపేసి, వాటి నిధులను మళ్లించి, ఎనలేని ద్రోహం చేస్తున్నారు.పాలన, చేయలేని, సంపదను సృష్టించలేని, పార్టీలను గెలిపించి, నేడు ప్రజలపై పన్నుల భారాన్ని వేసి, పాలించే పాలన కూడా ఒక పాలనే నా?