ఏపీలో తిరుమలలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తితిదే (TTD) మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు (Ramana Dikshitulu) అన్నారు. తిరుమల (Tirumala)లో అధికారుల తీరుపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో ఆగమ నియమాలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.” తిరుమలలో ఆగమశాస్త్ర నియమాలు పాటించడం లేదు. శాస్త్ర నియమాలకు విరుద్ధంగా పని చేస్తున్నారు. సొంత ప్రణాళిక ప్రకారం తితిదే అధికారులు వ్యవహరిస్తున్నారు. ధనికులైన భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వీఐపీల సేవలో అధికారులు తరిస్తున్నారు.” అని రమణ దీక్షితులు ట్విటర్‌లో పేర్కొన్నారు.