- ముగింపుకు భారత్ జోడో యాత్ర.. శ్రీనగర్‌లో తిరంగా ఎగురవేయనున్న రాహుల్..
భారత్ జోడో యాత్ర ముగింపుకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ గంపెడాశలు పెట్టుకున్న రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ఈ నెల 30వ తేదీన భారీ బహిరంగ సభతో ముగియనుంది. కన్యాకుమారిలో యాత్రను ప్రారంభించిన రాహుల్‌గాంధీ.. జనంతో మమేకమవుతూ చివరి మజిలీకి చేరుకున్నారు. భారత్ జోడో యాత్ర అనబడే 3,570 కిలోమీటర్ల రాహుల్ పాదయాత్ర జనవరి 30న జమ్మూకశ్మీర్‌లో ముగుస్తుంది. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో భాగంగాఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీనగర్‌లోని చారిత్రాత్మక లాల్ చౌక్‌లో రాహుల్ గాంధీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు.