కె.వి.పల్లి పోలీస్ వారికి రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలు మేరకు రాయచోటి డిఎస్పి శ్రీధర్ ఆధ్వర్యంలో కలకడ సిఐ నాగేంద్ర నేతృత్వంలో కె.వి. పల్లి ఎస్.ఐ లోకేష్ తన సిబ్బందితో కలిసి కె.వి. పల్లి పంచాయతీ మరియు మండల బండ వడ్డీ పల్లి క్రాస్ వద్ద వాహన లను తనిఖీ చేయుచుండగా ఒక మహేంద్ర జైలో వాహనము రాగా దాన్ని ఆపడానికి ప్రయత్నించుగా వారు తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించడం జరిగింది. వెంటనే పోలీస్ వారు అప్రమత్తమై వాహనాన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు వాహనం లో తనిఖీ చేయగా అందులో నాలుగు ఎర్రచందనం దుంగల ఉన్నవి అని ఇద్దరిని అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు విచారణలో ఇంకా నలుగురు ప్రమేయం ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు.వారు కేసులో సంబంధం ఉండినందువలన వారి కోసం ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి త్వరలో అరెస్టు చేస్తామని కె.వి. పల్లి ఎస్సై లోకేష్ తెలియజేయడం జరిగింది.