- ఓబ్రయ్ గ్రూప్ ప్రతినిధులతో ఎంపీ భరత్
- దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా ఏపీ ఉండాలి, అదే మా సీఎం లక్ష్యం-ఎంపీ భరత్
అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేసి దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా తీసుకురావాలన్నదే మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. శనివారం రాత్రి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయంలో ఓబ్రయ్ గ్రూప్ ప్రతినిధులను ఎంపీ భరత్ కలిశారు. తూర్పు గోదావరి జిల్లా పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా హేవలాక్ బ్రిడ్జి అభివృద్ధికి చేపడుతున్న పనులపై ఎంపీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత ఆధ్వర్యంలో ఫొటో ప్రదర్శన నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం పరంగా చేపడుతున్న చర్యలను ఓబ్రయ్ గ్రూప్ ప్రతినిధులకు వివరించారు. వీరు తిరుపతి నుండి విశాఖపట్నం వెళుతూ మార్గ మధ్యలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ ఓబ్రయ్ గ్రూప్ ప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలు, గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తున్నది వివరించారు. అనంతరం ఎంపీ భరత్ మాట్లాడుతూ రాజమండ్రి నగరంలోని హెవలాక్ బ్రిడ్జిని అభివృద్ధి చేస్తే సందర్శకుల సంఖ్య ఏ విధంగా పెరుగుతుందో, పర్యాటక పరంగా రాజమండ్రి ఎంతగా అభివృద్ధి చెందుతుందనేది ఒబెరాయ్ గ్రూప్ ప్రతినిధులకు వివరించానని, వారు కూడా ఎంతో ఆసక్తిగా విన్నారని ఎంపీ భరత్ చెప్పారు.