- అచ్చెన్నాయుడుపై అక్రమ కేసు దుర్మార్గం-యనమల రామకృష్ణుడు
- పోలీసుల భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే కేసు పెడతారా?
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుపై కేసు నమోదు చేయడం దుర్మార్గపు చర్య.
- కుప్పం సభలో అచ్చెన్నాయుడు ఎటువంటి రెచ్చెగొట్టే వ్యాఖ్యలు చేయలేదు.
- వైసీపీ అరాచకాలను మాత్రమే ప్రశ్నించారు.
- అంత పెద్ద సభ జరుగుతుంటే పటిష్ట భద్రత కల్పించాల్సిన పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు.
- దీనిపై ప్రశ్నిస్తే తప్పెలా అవుతుంది?
- లోకేష్ కు భద్రత కల్పించడం పోలీసుల బాధ్యత కాదా?
- పోలీసుల ఏకపక్ష వైఖరిని ప్రశ్నిస్తే నేరం చేసినట్టా?
- ఇటువంటి కేసులు మా నేతల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేవు.
- ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మా పోరాటం ఆగదు. అక్రమ కేసులు, అరెస్టులకు భయపడం.