ప్రకాశం జిల్లా కరవడి గ్రామంలో రైల్వే ఎలక్ట్రిక్ వైర్లు తెగిపోవడవల్ల తిరుపతి నుండి సికింద్రాబాద్ వెళ్లే నారాయణాద్రి – హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ 12733, చెన్నై – హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ తదితర రైళ్లు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని రైల్వే శాఖ గోప్యంగా ఉంచి ప్రయాణికులకు గత 6 గం.లకు పైగా తీవ్రమైన అసౌకర్యానికి గురిచేస్తున్నారు. వివిధ రైల్వేస్టేషన్ లలో ప్రయాణికులు రైళ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. అర్థరాత్రి పూట ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. రిజర్వేషన్లు అయిన వారికి కూడా కనీస సమాచారాన్ని కూడా రైల్వే అధికారులు అందిచుటలేదు. వేరే రైళ్లను కూడా వీరికి ఏర్పాటు చేయలేదు. ఇలా ఉంది మన రైల్వేశాఖ పనితీరు.