- బీసీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత చంద్రబాబుదైతే.. తగ్గించిన ఘనత జగన్‌దే
- స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించిన జగన్‌రెడ్డిని ఇంటికి పంపాల్సిందేనని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, నారా లోకేశ్ అన్నారు.
- మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే పాత పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
- స్థానిక సంస్థల్లో బీసీలకు 20 నుంచి 34 శాతానికి రిజర్వేషన్లు పెంచిన ఘనత చంద్రబాబుదైతే.. 24 శాతానికి తగ్గించిన ఘనత జగన్‌రెడ్డిదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.
- రెండో రోజు చేపట్టిన యువగళం పాదయాత్ర కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివరామపురానికి చేరుకుంది.
- శివరామపురంలో ఏర్పాటు చేసిన బీసీ సదస్సులో ఆయన పాల్గొన్నారు.
- పాదయాత్ర ద్వారా అందరికి న్యాయం చేస్తానన్న జగన్.. సంక్షేమంలో కోత వేశారని ఆరోపించారు.
- బోయలను ఎస్టీలలో చేరుస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని ధ్వజమెత్తారు.
- టీడీపీ అధికారంలోకి వచ్చాక కురుబ కులస్థులకు గ్రామ గ్రామాన ఆలయాలు కట్టిస్తామని.. ఆలయ నిర్మాణాల కోసం బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
- అధికారంలోకి వచ్చాక వడ్డెర్లకు గనులలో రాళ్లు కొట్టుకొనే అవకాశం పునరుద్ధరిస్తామన్నారు.
- జగన్లాగా తప్పుడు హామీలివ్వనని.. పూర్తి స్థాయిలో పరిశీలన చేశాక అమలు చేయగలిగే వాటిపైనే హామీ ఇస్తానన్నారు.
- ప్రజలను యువగళం పాదయాత్ర ద్వారా చైతన్యం చేద్దామన్నారు.
- శాసనసభలో తమ తల్లిపట్ల అగౌరవంగా మాట్లాడిన వారిని వదలిపెట్టనని హెచ్చరించారు.
- దొంగ బీసీ సర్టిఫికెట్లు జారీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
- బీసీలను సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
- పీఈఎస్ వైద్య కళాశాల నుంచి రెండో రోజు పాదయాత్ర ప్రారంభం
- కుప్పంలో పీఈఎస్ వైద్య కళాశాల నుంచి ఆయన యాత్ర కొనసాగించారు.
- విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.
- ఈ సందర్భంగా అనేకమంది విద్యార్థులు లోకేశ్‌తో సెల్ఫీలు దిగారు.
- కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద లోకేశ్‌కు ఘనస్వాగతం లభించింది.
- విద్యార్థులు లోకేశ్ కటౌట్‌కి పాలాభిషేకం చేశారు.
- చంద్రబాబు తమ ప్రాంతానికి డిగ్రీ కళాశాల తెచ్చిన కృతజ్ఞతతో అభిమానం చాటుకుంటున్నామని విద్యార్థులు తెలిపారు.
- పాదయాత్రలో భాగంగా గుడుపల్లె మండలం బెగ్గిపల్లె గ్రామస్థులతో లోకేశ్ సమావేశమయ్యారు.
- కనుమలదొడ్డి ప్రజలతో ముఖాముఖి నిర్వహించి.. గ్రామస్థుల నుంచి వినతులు స్వీకరించారు.
- తెలుగుదేశం ప్రభుత్వం రాగానే సామాజిక భవనాల నిర్మాణం పూర్తిచేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
- గ్రామంలో అసంపూర్తిగా ఉన్న కురుమ భవనాన్ని, ఆ పక్కనే ఉన్న వాల్మీకి భవానాన్నీ పరిశీలించారు.
- వైసీపీ వచ్చాక అణచివేతకు గురవుతున్న అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.
- అలాగే తెలుగుదేశం నాయకులను కేసులతో వేధిస్తున్న వారికి చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
- అనంతరం కనుమలదొడ్డిలో ప్రజల నుంచి వినతుల స్వీకరించి.. వారితో మాట్లాడారు.
- ఈ యాత్రలో కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు లోకేశ్‌తో కలిసి పాదం కలిపారు.