టీడీపీ కీలక నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి () తరలించారు. అత్యవసర విభాగంలో ప్రత్యేక వైద్య బృందం బచ్చులకు స్టంట్ వేసి చికిత్స (Treatment) అందిస్తోంది. బచ్చుల విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బచ్చుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులు, వైద్యులతో ఫోన్‌లో (Phone Call) మాట్లాడి తెలుసుకుంటున్నారు. మరోవైపు టీడీపీ () ముఖ్యనేతలు రమేశ్ ఆస్పత్రికి చేరుకుని బచ్చుల ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీస్తున్నారు.