- కొవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు.
- అనేకమందిని పొట్టన పెట్టుకున కరోనా వైరస్.
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారత్‌లో సగటు తలసరి ఖర్చు రూ. 5678
లాన్సెట్ గ్లోబల్ హెల్త్ నివేదికలో వెల్లడి
కొవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు. అనేకమందిని పొట్టన పెట్టుకున కరోనా వైరస్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా పెనుభారాన్ని మోపింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ చికిత్సకు అయిన ఖర్చు ఎంతో తెలుసా..? రూ. 30.08 లక్షల కోట్లు! అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఈ మేరకు చేసిన ఓ అధ్యయన నివేదికను ప్రముఖ జర్నల్ లాన్సెట్ ప్రచురించింది. దాని ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కొవిడ్ మరణాల్లో 27.2 శాతం భారత్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, పాకిస్థాన్‌లలోనే చోటుచేసుకున్నాయి. ‘‘2019లో భారత్‌లో ఒక్కో వ్యక్తి తన ఆరోగ్యానికి పెట్టిన ఖర్చు సగటు రూ.5658 కాగా 2026 నాటికి అది రూ.7626కు చేరే అవకాశం ఉంది. కరోనా సమయంలో చికిత్స వ్యయం 810శాతం మేర పెరిగింది. అదే సమయంలో భారత పౌరులు ఆరోగ్యంపై పెట్టిన తలసరి ఖర్చు సగటు రూ.5678గా ఉండగా.. ప్రభుత్వం పెట్టిన ఖర్చు సగటు రూ.2706గా ఉంది. 2019లో దేశ జీడీపీలో 3 శాతం ఉన్న ఆరోగ్య ఖర్చు 2026 నాటికి 3.1 శాతానికి పెరుగుతుందని అంచనా. 2021 జనవరిలో జీ20 దేశాల సమావేశంలో చేసిన నిర్ణయం మేరకు.. స్థూలదేశీయోత్పత్తిలో ఒక శాతా న్ని ఆరోగ్యం కోసం అన్ని దేశాలు కేటాయించనున్నాయి. ఈ నిర్ణయాన్ని అనుసరించి 2026 నాటికి భారత్‌లో ప్రతి వ్యక్తిపై ప్రభుత్వం పెట్టే ఖర్చు రూ. 4157 కు పెరుగుతుందని అంచనా. ఆమెరికాలో అత్యధికంగా ఒక్కో వ్యక్తి సగటున రూ.16.81 లక్షల్ని కరోనా సమయంలో ఖర్చు చేయగా, అత్యల్పంగా సోమాలియాలో 9 రూ.733 ఖర్చు పెట్టారు’’ అని లాన్సెట్ పేర్కొంది.