సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ రాశారు. ఈ రోజు విచారణకు హాజరవుతున్నానని తెలిపారు.వివేకానందరెడ్డి కేసు ప్రారంభమైన దగ్గరనుంచి నా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పనిగట్టుకుని ఓ వర్గం మీడియా లేనిపోని కథనాలను ప్రసారం చేస్తోంది. తప్పు దోవపట్టించేలా వార్తలను ప్రసారం చేస్తున్నారు.అందుకే విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నా అని ఆయన లేఖలో పేర్కొన్నారు.ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలి. తనతోపాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలి.ఈ విజ్ఞప్తులను సీబీఐ పరిగణలోకి తీసుకోవాలి అని సీబీఐని, ఎంపీ అవినాష్‌రెడ్డి కోరారు.