- తారకరత్నను బెంగళూర్‌కు తరలిస్తాం.
- అంబులెన్స్‌లో గ్రీన్ ఛానల్ ద్వారా తరలించే ఏర్పాట్లు చేస్తున్నాం.
- అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్లర్ల సూచనతోనే బెంగళూర్‌కు తరలిస్తాం.
- గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్ అయ్యింది.మిగితా అన్నీ రిపోర్టులు బాగున్నాయి.
- చంద్రబాబు ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. -బాలకృష్ణ.
- నందమూరి బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ ఫోన్.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జూ.ఎన్టీఆర్
పాదయాత్ర లో ఉన్న తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.తారకరత్న హర్ట్లో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించారు..వెంటనే ఆయన స్థానిక ఆసుపత్రికి తరలించాం.డాక్టర్లు ఎంతగానో శ్రమించి తారకరత్న కు ప్రాథమిక వైద్య అందించారు..యాంజియోగ్రామ్ తారకరత్న కు డాక్టర్లు నిర్వహించారు.ఆసుపత్రికి వచ్చేటప్పటికి తారకరత్న ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉంది.వైద్యులు ఎంతగానో కృషి అయన ఆరోగ్య పరిస్థితిని నిలకడగా తీసుకొచ్చారు.బాలకృష్ణ స్వయంగా ఉండి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించారు.బాలకృష్ణ వచ్చిన తర్వాత తారకరత్న ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుబడింది.నారా నందమూరి కుటుంబాల ఆశీస్సులతో తారకరత్న క్షేమంగా బయటకు వస్తారు అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.