- లోకేశ్ కు 200 మంది ప్రైవేటు బౌన్సర్లు – అనుక్షణం 400 వాలంటీర్లు..!!
నారా లోకేశ్ పాయాత్రకు భారీ ఏర్పాట్లు చేసారు. లోకేశ్ పాదయాత్ర కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు కొనసాగనుంది. కుప్పం నుంచి 400 మంది వాలంటీర్లు లోకేష్ ను అనుసరించనున్నారు.పాదయాత్ర వేళ లోకేశ్ కోసం ప్రత్యేకంగా ఒక క్యారవాన్ సిద్దం చేసారు. సకల హంగులతో దీనిని ఏర్పాటు చేసారు.తొలి రోజు యాత్ర.. బహిరంగ సభలో రాష్ట్ర వ్యాప్తంగా నేతలు పాల్గొనున్నారు.ముందుగానే కుప్పం చేరుకున్న పార్టీ నేతలు బహిరంగ సభ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. సభా వేదిక పై 300 మంది ఆశీనులు కానున్నారు. అచ్చెన్నాయుడు వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక..లోకేశ్ భద్రత కోసం ప్రత్యేకంగా బౌన్సర్లను సిద్దం చేసుకున్నారు. వాలంటీర్లు యాత్ర మొత్తం లోకేశ్ తో పాటుగా కొనసాగనున్నారు.