సీనియర్ నటి జమున మృతి సినీ రంగానికి తీరని లోటని రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, పీసీసీ సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాలేపల్లి మురళీధర్ అన్నారు. తెలుగు సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలు ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఆ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసారు. ఆయన మాట్లాడుతూ సినిమా రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా జమున తనదైన ముద్ర వేసారన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున 1989లో రాజమహేంద్రవరం నుంచి ఎంపీగా జమున విజయం సాధించి ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేసారన్నారు. కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (సిటిఆర్‌ఐ) ఇక్కడ స్థాపించడంతో పాటు కేంద్ర కారాగారం అభివృద్ధిలో కూడా ఆమె విశేష కృషి ఉందన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు