ఎంఎస్ ధోనీ అభిమానులకు శుభవార్త. ఈ ఏడాది ఐపీఎల్ (IPL) 2023లో ఆడతాడో లేదోననే ఆందోళనలో ఉన్న ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే వార్త వెలుగులోకి వచ్చింది. చాలా రోజుల తర్వాత ధోనీ బ్యాట్ పట్టాడు. నాలుగుసార్లు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని అందించిన మిస్టర్ కూల్.. ఎట్టకేలకు ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. రాంచీలోని ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (JSCA)లో నెట్స్‌లో సాధన చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు రవీంద్ర జడేజా కూడా శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకొని మళ్లీ టోర్నీలకు సిద్ధమవుతున్నాడు. గతేడాది విఫలమైన చెన్నై.. ఈసారి ఎలాగైనా ఛాంపియన్‌గా నిలవాలని సీఎస్‌కే సిద్ధమైంది. దానికోసం ఇప్పటికే మినీ వేలంలో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (రూ.16.25 కోట్లు)ను కొనుగోలు చేసింది. ఇప్పటికే ఆ జట్టులో ధోనీ, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, అంబటి రాయుడు, రుతురాజ్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.