- సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ S.వెంకటరావు కు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అవార్డు.
మంగళగిరి ఏపీ ఎస్పీ ఆరవ పటాలంలో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీ S.వెంకటరావు గారికి 2023 వ సంవత్సరానికి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అవార్డు పొందుతున్నారు . 1983 వ సంవత్సరం లో కానిస్టేబుల్ గా ఉద్యోగా బాధ్యతలు స్వీకరించి అంచలంచెలుగా ఎదుగుతూ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అవార్డును అందుకోనున్నారు. గతంలో 2013 వ సంవత్సరంలో ఇండియన్ పోలీస్ మెడల్, 2021 వ సంవత్సరంలో సేవ పతకం స్వీకరించినారు. సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ఉన్నతాధికారుల మన్ననలు పొందుతూ పోలీస్ మెడల్స్ అందుకోవడం విశేషం. కాగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అవార్డు దక్కించుకున్న రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ యెస్ వెంకటరావు గారికి కమాండెంట్ శ్రీ K.S.S.V. సుబ్బారెడ్డి ఐ. పి. యెస్.గారు మరియు అడిషనల్ కమాండెంట్ శ్రీ E.S.సాయి ప్రసాద్ గారు మరియు పలువురు బెటాలియన్ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.