- డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవ.
పశువులకు అంబులెన్స్ సేవలు మరింత విస్తృతం. - రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.240.69 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌ల ఏర్పాటు.
- ఇప్పటికే మొదటి దశలో రూ.129.07 కోట్ల వ్యయంతో 175 పశుఅంబులెన్స్‌ల ద్వారా 1,81,791 పశువులను ప్రాణాపాయం నుంచి రక్షించి 1,26,559 మంది పశు పోషకులకు లబ్ధి.
- రెండో దశలో భాగంగా రూ.111.62 కోట్ల వ్యయంతో ఇవాళ మరో 165 పశు అంబులెన్స్ వాహనాలను సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్.
- డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవ వాహనం ఎక్కి పనితీరు, సేవలను స్వయంగా పరిశీలించిన సీఎం.
- కార్యక్రమంలో పాల్గొన్న పశుసంవర్ధక, పాడిపరిశ్రాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎం వీ యస్ నాగిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎం హనుమంతరావు, లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తాఫా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాల గిరి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు.