- వెలంపల్లి శ్రీనివాసరావు గారూ.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే మీ జాగీరు కాదు. ఆ నియోజకవర్గానికి మీరు జమీందారు కాదు.
- నిన్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నాయకులు సామినేని ఉదయభానుతో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం.
- ఒక వైఎస్సార్ సీపీ నాయకుడిగా, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానిగా,వైఎస్ జగన్ శ్రేయోభిలాషిగా, ఉన్నత విద్యావంతుడిగా, విజ్ఞత కలిగిన పౌరుడిగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను, సొంత పార్టీ ఎమ్మెల్యే తీరుపైనే ఇలా బహిరంగంగా మాట్లాడాల్సి రావడం బాధగానే ఉన్నా తప్పడం లేదు. ఈ పరిస్థితి తీసుకువచ్చింది కూడా వెలంపల్లి శ్రీనివాసరావు ప్రవర్తనే అని తెలియజేస్తున్నా.
- ఇప్పటికే పార్టీలో చాలాకాలంగా అంకితభావంతో పని చేస్తున్న చాలా మంది నాయకులు, కార్యకర్తలు వెలంపల్లి తీరు వల్ల అవమానాలకు గురయ్యారు. నష్టోయారు. ఇప్పుడు కూడా మేము నోరుమెదపకుండా చూస్తూ ఊరుకుంటే పార్టీకి తీవ్రనష్టం కలుగుతుందని, మొదటి నుంచి పార్టీలో ఉంటున్న వారు మరింత ఆందోళన, అభద్రభావానికి గురవుతారని, పార్టీకి దూరమవుతారని, జగన్ టార్గెట్ పెట్టిన why not 175కి ఇక్కడే తూట్లు పడతాయనే ఆందోళన, ఆవేదనతో బయటకు వచ్చి మాట్లాడుతున్నాను.
- ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్సార్ కి అత్యంత ఇష్టమైన నాయకుడిగా, ఆయన అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి సామినేని ఉదయభాను. ఆ తర్వాత వైఎస్సార్ కుమారుడు జగన్ వెంట తొలి నుంచి నడిస్తున్నారు.
- వైఎస్సార్ సీపీని ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ ప్రకటించినప్పుడు కృష్ణా జిల్లాలో, విజయవాడలో పార్టీకి ఉన్న ఏకైక పెద్ద నాయకుడు ఉదయభాను.
- 2011లో వైఎస్సార్ సీపీ ఆవిర్భావం సమయంలో జగన్ జెండా, అజెండా ప్రకటించినప్పుడు విజయవాడ గాంధీనగర్ లో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేసింది సామినేని ఉదయభాను. ఆయనతోపాటు పి.గౌతంరెడ్డి, నేను, మరికొందరు మాత్రమే ఉన్నారు.
- ఆ తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉదయభాను దాదాపు ఆరేళ్లు పని చేశారు. అన్ని వర్గాలని కలుపుకుని పార్టీ పటిష్టత కోసం పని చేశారు.
- నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను వదిలి జగన్ వెంట నడిచారు. నేటికీ జగన్ పై అదే ఆప్యాయతను కలిగి ఉన్నారు.
- అటువంటి నాయకుడు మా ముఖ్యమంత్రిని కలిస్తే ఎన్నికలకి ఏడాది ముందు పార్టీలో చేరిన వెలంపల్లి శ్రీనివాసరావు నా నియోజకవర్గంలో నీ పెత్తనం ఏమిటీ అని ప్రశ్నించడం, దురుసుగా మాట్లాడటం అత్యంత బాధాకరం.
- ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. అదేమిటంటే ఉదయభాను కలిసింది మా సీఎం జగన్ ని. అది కూడా ఆయనకు సుదీర్ఘకాలంగా మిత్రుడు, ప్రస్తుతం ఏ పార్టీలో లేని వ్యక్తి కుమార్తె పెళ్లికి ఆహ్వానించారు. పెళ్లికార్డు ఇచ్చారు. అదేమి నేరమా?
- ఉదయభాను కలిసింది పక్క పార్టీ నాయకుడిని కాదు కదా? తీసుకువెళ్లింది వెలంపల్లికి రాజకీయ శత్రువును కాదు.. ఇచ్చింది వెలంపల్లి మీద ఫిర్యాదు కాదు. పెళ్లికార్డు. దానికి కూడా ఇంత రాద్దాంతమా? ఏమిటి ఇది. తమ అభిమాన నాయకుడికి, తాము నమ్మి వెంట నడుస్తున్న నాయకుడికి పెళ్లిపత్రిక ఇవ్వడానికి కూడా ఎమ్మెల్యే అనుమతి కావాలా? ఇటువంటి ధోరణి సరికాదు.
- పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటు వెలంపల్లి శ్రీనివాసరావు కు ఇచ్చిన సమయంలో ఇక్కడి ముస్లిం మైనారిటీ కి ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ వాగ్దానం చేశారు ఎక్కడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ముస్లిం నాయకుడికి ఎమ్మెల్సీ పదవి వస్తుందోనని, తనకు ప్రత్యామ్నాయంగా మరొక పవర్ సెంటర్ ఏర్పడుతుందోనని, మైనారిటీలు మళ్లీ నియోజకవర్గంలో రాజకీయంగా బలపడతారని, తనకు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయనే దురుద్దేశంతో సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్సీ పదవి కోసం సిఫార్సు చేయలేదా వెలంపల్లి. అప్పుడు తెలియదా పక్క నియోజకవర్గం లో మీకు ఏమి పని అని.
- వక్ఫ్ బోర్డు పదవులు, లీజుల విషయంలో చైర్మన్ తో గొడవలకు దిగుతున్నప్పుడు తెలియదా అది పక్కవారి పరిధి అని…
- ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలో వెలంపల్లి శ్రీనివాసరావు చేస్తున్న స్వార్థపూరిత రాజకీయాల వల్ల చాలామంది కార్యకర్తలు, నాయకులు ఇబ్బందులు పడుతున్నారు.
- కొందరు తాము చనిపోతామని కూడా సెల్ఫీ వీడియోలు పెట్టారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.. కానీ బహిరంగంగా మాట్లాడటం సంస్కారం కాదు.
- ఉదయభాను విషయంలో వెలంపల్లి వ్యవహరించి తీరును, కేవలం నలుగురు వ్యాపారులను వెనకేసుకుని తొలి నుంచి పార్టీ కోసం పని చేస్తున్నవారిని పిర్ర గిల్లి జోలపాడుతున్న చందంగా పశ్చిమ నియోజకవర్గంలో వెలంపల్లి చేస్తున్న తప్పుడు చర్యలని ముఖ్యమంత్రి దృష్టికి, పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళాము.
- పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ దెబ్బతినకుండా చూస్తాం. నిజమైన వైఎస్ కుటుంబ శ్రేయోభిలాషులకు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటాం.