రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి – విజయవాడలో వారాహి ప్రచార రథం నుంచి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ . అంతకు ముందు – ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ , పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించిన పవన్ కళ్యాణ్ .పవన్ కళ్యాణ్ కి, మనోహర్ కి ఆలయం మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో భ్రమరాంబ ,ఆలయ అధికారులు, వేద పండితులు.
- అమ్మవారిని అంతరాలయం గుండా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆలయ ఆవరణలో వేద పండితుల ఆశీర్వచనం
- రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్న పవన్ కళ్యాణ్ , మనోహర్.
- ఇంద్రకీలాద్రి కింద జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు