- కడియం నర్సరీలలో కొనసాగుతున్న సంక్రాంతి సందడి, తగ్గని సందర్శకుల తాకిడి.
సంక్రాంతి పండుగ వెళ్లి వారం అవుతున్నా తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలలో ఆ సందడే ఏమాత్రం తగ్గలేదు. సంక్రాంతి సందర్భంగా వచ్చే సందర్శల కోసం మొక్కలు, పూలతో ఏర్పాటు చేసిన కూర్పులు తిలకించేందుకు సందర్శకులు వస్తేనే ఉన్నారు. అందుకనే రైతుల కూడా వాటిని తీయకుండా సంరక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆ నర్సరీలను తిలకిస్తే సంక్రాంతి వెళ్లిపోయిందన్న సంగతే తెలియడం లేదు. అంతలా రైతులు ఏరోజుకారోజు ముస్తాబు చేస్తున్నారు.కొన్ని రకాల సీజనల్స్ మొక్కలు కనుమరుగయ్యే సమయం దగ్గర పడుతున్నప్పటికీ మంచు అధికంగా ఉండటం వల్ల జనవరి ముగుస్తున్నా వాటి అందాలను అరబోస్తూనే ఉన్నాయి.