• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home న్యూస్

రామోజీ,పవన్, చంద్రబాబులకు నందిగం సురేష్ సవాల్

pd_admin by pd_admin
January 25, 2023
in న్యూస్
0 0
0

Contents

  • 1 ఎంపీ నందిగం సురేష్ సవాల్
    • 1.1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ శ్రీ నందిగం సురేష్ ప్రెస్ మీట్ః
  • 2 ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
  • 3  టీడీపీ హయాంలో 2018-19 ఎస్సీ సబ్ ప్లాన్ ను తీసుకుందాంః
  • 4 మీ సొంత గ్రామాల్లో ఎస్సీలకు ఎంతిచ్చామో లెక్కలు తీద్దామా..?
    • 4.1 ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు మీకు గొప్పా?
    • 4.2 ఎనాడైనా ఎస్సీ, బీసీలను పక్కన కూర్చోబెట్టుకున్నావా పవన్‌…?
    • 4.3 మీరు ఇచ్చిన హామీలు ఏనాడైనా ప్రజలకు చేరాయా..?
    • 4.4 టీడీపీ, రామోజీ రాతలనే పవన్‌ కళ్యాణ్‌ వళ్లిస్తాడు

ఎంపీ నందిగం సురేష్ సవాల్

రామోజీ, బాబుల సొంత ఊళ్ళల్లో ఎస్సీలకు ఎవరి హయాంలో మేలు జరిగిందో చర్చిద్దామా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ శ్రీ నందిగం సురేష్ ప్రెస్ మీట్ః

  • ఎస్సీలపై లేని ప్రేమను రామోజీ-బాబులు ఒలకబోస్తున్నారు
  •  ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా.. అన్న బాబును రాజకీయాల్లో కొనసాగించాలా లేక జైల్లో పడేయాలా?
  • ఈనాడు రామోజీ బొజ్జ రాక్షసుడిలా తయారయ్యాడు
  • ఈనాడు చూడకూడదు, చదవకూడదు, మాట్లాడకూడదు
  • కుళ్ళు, కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్లు రామోజీ, బాబు
  • బాబు హయాంలో పొలంబడి, చంద్రన్న పెళ్ళి కానుక, ఎన్టీఆర్ ఉద్యోన్నతి, మా ఇంటి మహాలక్ష్మిలకు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మళ్ళిస్తే రామోజీ కళ్ళకు కనిపించలేదా?
  • దళితుల పిల్లలు ఇంగ్లీషు మీడియం చదవకూడదని లెక్చర్లు ఇచ్చింది మీరు కాదా..?
  • ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా అన్న బాబు చంకనెక్కిన పవన్ కల్యాణ్ ఎస్సీలను ఉద్ధరిస్తాడా..?
  • పవన్ కల్యాణ్ ఏనాడైనా ఎస్సీ, బీసీలను సభల్లో తన పక్కన కూర్చోబెట్టుకున్నాడా..?
  • లోకేష్ పాదయాత్ర వల్ల పార్టీలో కాదు.. అతని శరీరంలో మార్పు వస్తుంది-ఎంపీ నందిగం సురేష్

ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…

  • ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌పై ఈనాడు తప్పుడు రాతలు.
  • చంద్రబాబు, రామోజీలు ఏనాడైనా బడుగు బలహీన వర్గాలపై ప్రేమ చూపించిన దాఖలాలు లేవు. వారు ఎప్పుడూ దళితులను, గిరిజనులను చిన్నచూపే చూశారు.
  • ఎస్సీలంటే ఎప్పుడూ చిన్నచూపుతోనే ఉండే వారికి ఇప్పుడు ఆకస్మాత్తుగా ఎస్సీలు గుర్తుకువచ్చారు, లేని ప్రేమను ఒలకబోస్తున్నారు
  • టీడీపీ హయాంలో ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను పక్కదారి పట్టించి, ఇతర పథకాలకు వాడినప్పుడు ఈనాడు రామోజీకి ఇలాంటి రాతలు రాయాలనిపించలేదు.

 టీడీపీ హయాంలో 2018-19 ఎస్సీ సబ్ ప్లాన్ ను తీసుకుందాంః

  • ఇందులో 9వ ఐటమ్ చూడండి.. పొలం బడి అని ఉంది.
  • అలాగే, 12,13 ఐటమ్స్ పొలం పిలుస్తోంది – చంద్రన్న రైతు క్షేత్రాలు అని పెట్టారు.
  • అలాగే, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన శానిటరీ నాప్ కిన్లు, సామాజిక పెన్షన్లు.. ఇవన్నీ ఎస్సీ సబ్ ప్లాన్ లోనే చేర్చేశారు.
  • అంతేకాకుండా, ఎన్టీఆర్ సుజల స్రవంతిని కూడా ఎస్సీ సబ్ ప్లాన్ లో భాగం చేసేశారు.
  •  చంద్రన్న పెళ్ళి కానుక, ఎన్టీఆర్ ఉద్యోన్నతి, మా ఇంటి మహాలక్ష్మి, పిల్లలకు పౌష్టికాహారం, అన్న అమృతహస్తం.. అంటూ ఇలా ప్రతి పథకాన్నీ టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ కాంపొనెంట్ లో భాగంగా చూపింది.
  • మరి టీడీపీ హయాంలో ఇలాంటి వార్త రాయాలని అనిపించని ఈనాడు, రామోజీ.. ఇప్పుడు పెన్షన్లు, గోరుముద్దల ఖర్చులు కూడా సబ్ ప్లాన్ లోనే వేసేశారు, ఇది తప్పు అంటూ నిన్న బ్యానర్ వేసేశారు. అంటే దీని అర్థమేమిటి..?, ఏ సామాజికవర్గం మీద ప్రేమ?
  • ఎస్సీ, ఎస్టీల మీద ప్రేమ అంటారా.. లేక.. ఎస్సీ, ఎస్టీలంటే రామోజీ-చంద్రబాబు, మేమే ఎస్సీలం, మేమే ఎస్టీలం అంటారా..?
  • చంద్రబాబు తన ఐదేళ్ల కాలంలో ఎస్సీలకు కేవలం 33 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు
  • అదే, జగన్మోహన్‌రెడ్డి గారు ఈ మూడున్నరేళ్లలోనే ఎస్సీల సంక్షేమం కోసం రూ.48 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు.

మీ సొంత గ్రామాల్లో ఎస్సీలకు ఎంతిచ్చామో లెక్కలు తీద్దామా..?

  • కడుపు నిండా కుళ్లు, కుట్రలు, కుతంత్రాలతో రామోజీ ఓ బొజ్జ రాక్షసుడిలా తయారయ్యాడు.
  • ఇలాంటి నీచ సంస్కృతి కలిగిన వ్యక్తి జగన్‌ గారి గురించి, ఈ ప్రభుత్వంపైన అడ్డగోలు రాతలు రాయడం దారుణం
  • రామోజీ సొంత గ్రామంలోగానీ, చంద్రబాబు సొంత గ్రామంలోగానీ.. ఎస్సీలకు చంద్రబాబు ఎంతిచ్చాడు..మేము ఎంతిచ్చామో లెక్కలు తీద్దామా..?. సవాల్ విసురుతున్నాను. మీరు సిద్ధమా..
  • మేము ఆ గ్రామాల్లో ఎంత ఇచ్చామో కరపత్రాల ద్వారా గడప గడపకూ మా ఎమ్మెల్యేలు వివరిస్తున్నారు
  • అందుకే, ఈనాడు పేపర్‌ను చదవుకూడదు…చూడకూడదు.. మాట్లాడకూడదు.

ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు మీకు గొప్పా?

  • ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అన్న చంద్రబాబు గురించి రామోజీ ఘనంగా రాతలు రాస్తాడు
  • రాజధాని ప్రాంతంలో ఎస్సీలకు ఇళ్ల ప్లాట్లు ఇస్తామంటే.. డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని అడ్డుకున్న చంద్రబాబు గురించి మాత్రం రామోజీ రాయడు.
  • పైగా, చంద్రబాబుకు భజన చేస్తూ, అలా ఇళ్ళ పట్టాలు ఇస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని ఈ పచ్చ మీడియా ఆనాడు రాతలు రాశారు
  • అలాంటి వారు ఆకస్మికంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ అంటూ మామీద లేని ప్రేమ చూపిస్తున్నారు
  • చంద్రబాబు ఆనాడు ఎస్సీలకు ఇచ్చిన పథకాలు కూడా లబ్ధిదారుల ఇంటికి చేరలేదు
  • జగన్‌ గారి ప్రభుత్వంలో నేరుగా లబ్ధిదారుడి ఖాతాల్లోకి డీబీటీ ద్వారా వెళ్తున్నాయి

ఎనాడైనా ఎస్సీ, బీసీలను పక్కన కూర్చోబెట్టుకున్నావా పవన్‌…?

  • ఏనాడైనా పవన్‌ కళ్యాణ్‌…తన సభల్లో తన అన్నను, నాదెండ్ల మనోహర్‌లను తప్ప బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గీయులను పక్కన కూర్చోబెట్టుకున్నాడా..?
  • అలాంటి పవన్‌ కళ్యాణ్‌ కూడా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ గురించి మాట్లాడటం హాస్యాస్పదం
  • జనసేన నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గెలిస్తే ఆతన్ని వెంటేసుకుని ఎక్కడికైనా వెళ్లావా..?
  • ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు చంకనెక్కిన పవన్‌ కళ్యాణ్‌ కూడా మా గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు
  • రామోజీ సిగ్గు, బిడియం అన్నీ వదిలేశాడు…ఈ వయసులోనూ నీచమైన రాతలు రాస్తున్నాడు
  • మీరు ప్రభుత్వంపైన తప్పుడు ప్రచారం చేస్తూ ఎస్సీ, ఎస్టీలను అణగదొక్కాలని చూస్తున్నారని మర్చిపోవద్దు
  • రామోజీ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ని పైకి పంపించిన ఈ దుష్టచతుష్టయం అంతా అక్రమ మార్గంలోనే నడుస్తున్నారు
  • ఎస్సీలకు ఉన్నత స్థానాలు రాకూడదు..ఎప్పుడూ చంద్రబాబే పరిపాలించాలని వారు కోరుకుంటున్నారు
  • చంద్రబాబు తప్ప వేరే సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని వారు సిఎంగా సహించలేని పరిస్థితి ఉంది
  • ఇలాంటి వ్యక్తులు మాకు అవసరం లేదనే 2019లో ఎస్సీలంతా పచ్చ గ్యాంగ్‌ను పక్కన పెట్టారు
  • మీకు ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే మీరేం చేశారో.. ప్రజలకు చెప్పే దమ్ముందా..?. మేమేం చేశామో చెబుతాం.
  • ఇప్పటికే మా ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి ఎంతెంత మేలు చేశామో చెప్తూనే ఉన్నారు
  • కుక్కమూతి పిందెలు లాంటి వ్యక్తులు లోకేష్, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లను అధికార పీఠం ఎక్కించడానికి మీరు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు ఫలించవు.
  • మరోసారి మీ అందర్నీ బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
  • జగన్మోహన్‌రెడ్డి గారు తమను సొంత అన్నలా చూసుకుంటున్నాడని ఎస్సీలు భావిస్తున్నారు

మీరు ఇచ్చిన హామీలు ఏనాడైనా ప్రజలకు చేరాయా..?

  • జగన్‌ గారు ఇచ్చిన ప్రతి హామీని.. చెప్పినవీ, చెప్పనివి కూడా నెరవేర్చారు.
  • 33 లక్షల ఇళ్లు ఇస్తుంటే వాటిపై అక్కసు వెళ్లగక్కుతారు
  • మా పిల్లలు ఇంగ్లీషు మీడియం చదువుకుంటే మీకు భయం
  • ఈ మూడున్నరేళ్లలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు
  • అభివృద్ధి అంటే ఆకలితో ఉన్న వారి కడుపునిండాలి.. ఇది మేం ఎంచుకున్న అభివృద్ధి. మా జీవితాలు బాగుపడాలి.
  • చంద్రబాబు హయాంలో అభివృద్ధి అంటే జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలు దోచుకుతినడమే
  • కుళ్లు, కుట్రలు వారి జన్మహక్కు అన్నట్లు రామోజీ, చంద్రబాబు బతుకుతున్నారు
  • ఎందుకు పనికిరాని లోకేష్‌ని, నిలకడే లేని పవన్‌ కళ్యాణ్‌ని, మోసమే జీవితం అనే చంద్రబాబును గద్దెనెక్కించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే మాపై తప్పుడు రాతలు.
  • కనీసం వార్డు మెంబర్‌గా గెలవని లోకేష్‌కి కూడా సిఎం సీటుపై ఆశ ఉంది. నిలకడలేకుండా ఏ పార్టీతో ఎప్పుడు వెళ్తాడో కూడా తెలియని పవన్‌ కళ్యాణ్‌ లెక్చర్లు ఇస్తున్నాడు. వీళ్లంతా కలిసి ఈ రాష్ట్రాన్ని ఏదో చేసేయాలి అనుకుంటే కుదరదు. పెన్నూ వారిదే…పేపరూ వారిదే కాబట్టి నోటికొచ్చింది రాసుకుంటున్నారు

టీడీపీ, రామోజీ రాతలనే పవన్‌ కళ్యాణ్‌ వళ్లిస్తాడు

  • ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్న చంద్రబాబును పవన్‌ కళ్యాణ్‌ పశ్నించాలి కదా..?. అలా ప్రశ్నించకపోగా, ఆయన చంకనెక్కి నీతులు చెబుతాడు.
  • పవన్‌ టీడీపీ వారు ఇచ్చే స్క్రిప్ట్‌ చదవడం మానేసి, తన సొంతగా ఏదైనా ఎజెండా ఉంటే మాట్లాడితే బాగుంటుంది.
  • టీడీపీ, రామోజీ రాసే రాతలే పవన్‌ మాట్లాడుతున్నాడు
  • లోకేష్‌ ఖాళీగా ఉండి ఏం చేస్తాడు…పాదయాత్ర చేసుకోనివ్వండి. ఆయన్ను అడ్డుకోడానికి లోకేష్‌ ఏమీ పెద్ద పనోడు అయితే కాదు.
  • లోకేష్ పాదయాత్ర వల్ల వాళ్ళ పార్టీలో మార్పు సంగతి ఏమోగానీ, శరీరంలో మార్పు వస్తుందేమో.
Tags: చంద్రబాబులకుచంద్రబాబులకు నందిగం సురేష్ సవాల్నందిగంపవన్రామోజీసవాల్సురేష్

Recent Posts

  • కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు దక్కించుకోబోయే నేతలు ఎవరు…?
  • చక్రం తిప్పునున్న కేటీఆర్ ! కష్టం ఫలించేనా?
  • రాజకీయం కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం – జనసేనాని పవన్ కళ్యాణ్
  • మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ..17న బడ్జెట్
  • నవజీవన్ ఎక్స్‎ప్రెస్ రైలులో పొగలు..పరుగులు పెట్టిన ప్రయాణికులు

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In