వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ప్రెస్‌మీట్:
- వికేంద్రీకరణ వల్లే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యం: లక్ష్మీపార్వతి వెల్లడి
- రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం కృషి
- ఆ దిశలోనే ఆయన అడుగులు వేస్తున్నారు. పని చేస్తున్నారు
- గతంలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లు కూడా ప్రవేశపెట్టారు .మళ్లీ ఇప్పుడు ఆ అవసరం ఉంది.
- లోకేష్ పొలిటికల్ కమెడియన్: లక్ష్మీ పార్వతి
వారికీ ఆత్మగౌరవం ఉంటుంది:
ఉత్తరాంధ్రకు, రాయలసీమకు ఆత్మగౌరవం ఉండకూడదా? కేవలం అమరావతిలో రియల్ ఎస్టేట్ చేసే వారికే ఆత్మగౌరవం ఉంటుందా? రాజధాని అక్కడే ఉండాలని చంద్రబాబు అండ్ కో కోరుతోంది. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమే వారు ఆ డిమాండ్ చేస్తున్నారు. నిజానికి అన్ని ప్రాంతాల వారికి ఆత్మ గౌరవం ఉంటుంది. తమ ప్రాంతం అభివృద్ధి చెందాలని వారూ ఆకాంక్షిస్తారు.
ఆ దిశలోనే సీఎం అడుగులు:
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని, అభివృద్ధి అనేది ఒకేచోటుకు పరిమితం కావొద్దని సీఎం వైయస్ జగన్ తలంచారు. అందుకే పరిపాలన వికేంద్రీకరణ ప్రతిపాదించి, ఆనాడు బిల్లు కూడా ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే, అన్ని ప్రాంతాల వారు సంతోషంగా ఉంటేనే, సమగ్ర అభివృద్ధి అనేది సాధ్యం. అందుకే వికేంద్రీకరణపై మరోసారి బిల్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది.
లోకేష్ రాజకీయ కమెడియన్:
ఇవాళ లోకేష్‌ను పాదయాత్రకు పంపిస్తున్నారు. ఆయన ఏనాడూ, ఏ ఒక్క ఎన్నికలో కూడా గెలవలేదు. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేడు. ఆయనను ఎలాగైనా సీఎంను చేయాలని చెప్పి, చంద్రబాబు జనంలోకి పంపిస్తున్నారు. లోకేష్ ఒక రాజకీయ కమెడియన్. ఆయన పాదయాత్ర కూడా కామెడీ మాదిరిగానే ఉంటుందని శ్రీమతి లక్ష్మీపార్వతి అన్నారు.