- పల్నాడు జిల్లా బీజేపీ కీలక నేతలు… పార్టీకి గుడ్‌బై…
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అనుచరులు, పెదకూరపాడు నియోజకవర్గ బీజేపీ నాయకులు తమ పదవులకు రాజీనామా చేస్తునట్టు క్రోసూరులో ప్రకటించారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలికి వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నట్లు బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు కర్ణా సైదారావు వెల్లడించారు. సోము వైసిపికి బిజెపిని తాకట్టు పెట్టారని విమర్శించారు. మోడీ ఆశయాలను గ్రామ గ్రామ ప్రచారం చేయాలనుకున్నామని, అయితే మిత్రపక్షమైన జససేన అధినేత చిత్ర పటానికి పూల మాలలు వేసినా వ్యతిరేకించారని విమర్శించారు. బీజేపీని భ్రష్టు పట్టించారని విమర్శించారు…
సునీల్ దియోదర్ , మధుకర్‌కు పార్టీలో జరుగుతున్న అన్ని విషయాలను చెప్పామని, అయినా చర్యలు తీసుకోలేదని వీరు ఆరోపించారు. సునీల్ ధియోధర్ మౌనం దేనికి సంకేతమని వీరు ప్రశ్నించారు. కన్నా వర్గమని కార్యవర్గ సమావేశాలకు తమను పిలవలేదని అన్నారు. సోము తన ఆస్తులను పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని పెదకూరపాడు బీజేపీ ఇంఛార్జి గంధం కోటేశ్వరరావు ఆరోపించారు. కన్నా వర్గమనే పేరుతో చాలామందిని సోము పక్కన పెట్టారని అన్నారు.గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 26న భాజపాకు రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాలు ఆశక్తి రేపుతున్నాయి.