- కూలి పనులకు అని వెళ్లి… మృత్యు లోకానికి..
- రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కర్నూలు జిల్లా కౌతాళం మండలం అగసలదిన్నె గ్రామానికి చెందిన లింగమ్మ 36 సంవత్సరాలు కూలి కోసం పనుల కోసం ఆటోలో కుంటనహళ్ కు వెళ్లి పని ముగించుకొని ఆటో లో తిరిగి వస్తుండగా ఉప్పర హాల్ గ్రామం వద్ద ఆగి ఉన్న ఆటోను ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ డీ కొట్టడంతో లింగం బొమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తీసుకువచ్చారు. రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేసారు .కౌతాళం పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రమాదానికి కారణమైన కారణమైన టాక్టర్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడి. మృతురాలికి భర్త పాపన్న ముగ్గురు పిల్లలు ఉన్నారు.ఆటోలో మొత్తం 28 మంది దాకా కూలీలు ఉన్నారు అయితే ఆటోలో ముందు భాగంలో కూర్చునడంతో డాక్టర్ ఢీకొని తీవ్ర గాయాలైనట్లు కుటుంబ సభ్యులు వెల్లడి