- ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం పొడిగింపు హర్షనీయం.
- దళిత చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లాది ప్రసాదరావు.
ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ ను రాష్ట్ర ప్రభుత్వం మరో 10 ఏళ్లపాటు పొడిగించడం పట్ల దళిత చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లాది ప్రసాదరావు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం రెడ్డిగూడెం లోని తెలుగు వార్త కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా దళిత ,గిరిజనులను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరో పదేళ్లపాటు పొడిగిస్తూ తీసుకొచ్చిన జీవోను స్వాగతిస్తున్నామని ప్రసాదరావు అన్నారు. 2013 జనవరి 23న అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న ఆలోచన విధానంతో ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.ఎస్సీ,ఎస్టీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో 10 ఏళ్ల పాటు పొడిగించిన చట్టం ద్వారా ఎస్సీ,ఎస్టీలు వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయంలో అభివృద్ధి చెందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని పదేళ్లకు ఒకసారి పొడిగించే విధానం కాకుండా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ ను శాశ్వత చట్టంగా రూపొందించేందుకు దళిత, గిరిజనుల పట్ల చిత్తశుద్ధితో ప్రభుత్వం ప్రతిపక్షాలు తీర్మానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం మండల వైస్ ఎంపీపీ చాట్ల రాబర్ట్, వైసిపి ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పల్లెపాము అంతోని, మండల ఎస్సీ సెల్ నాయకులు వీరమల్ల సుధాకర్, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు పత్తిపాటి ఇమ్మానుయేల్, దళిత నాయకులు చాట్ల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.