- ఏపీ రేషన్ కార్డు దారులకు శుభవార్త
- రెండు కిలోల గోధుమపిండి పంపిణీ
ఏపీలోని నగరాలు, పట్టణాల్లో బియ్యం కార్డుదారులకు రెండు కిలోల గోధుమపిండి పంపిణీ చేయనున్నట్టు పౌరసరాఫరాల శాఖ అధికారులు వెల్లడించారు.వచ్చే నెల నుంచి బియ్యంతో పాటు కిలో రూ. 16 చొప్పున రెండు కిలోల గోధుమపిండి సరాఫరా చేయనున్నారు.ఇప్పటికే గోధుమపిండి గోదాములకు చేరగా, ఈ వారంలో రేషన్ డిపోలకు సరాఫరా చేయనున్నారు. జొన్నలు, రాగులు పంపిణీ పై ఇంకా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని అధికారులు తెలిపారు.