అమరావతి రాజధానిపై మాజీ మంత్రి డాక్టర్ డియల్ రవీంద్రారెడ్డి కామెంట్స్…
- సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆశ ,అధికారం ఆలోచన డబ్బు కక్షతో వేధించడం తప్ప మరేమీ లేదు.
- అమరావతి ప్రాంతంలో 29 వేల మంది రైతులను వేధింపులకు గురి చేస్తున్నాడు.
- ప్రజలందరి దృష్టిలో అమరావతి రాజధాని… జగన్మోహన్ దృష్టిలో మాత్రమే రాజధాని కాదు.
- అమరావతి రాజధానిగా ఉండాలని ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మీడియాల ద్వారా కూడా నేను మద్దతు తెలిపాను.
- అమరావతి రాజధాని మధ్యలో ఉండటం వల్ల అన్ని ప్రాంతాలకు కడప జిల్లాకు కూడా అనుకూలం.
- అమరావతి రాజధాని రైతులు అభినందించటానికి రావడం సంతోషంగా ఉంది.
- అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు క్లియర్ కట్ జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీం కోర్టులో కూడా ఆయన గెలవలేరు.
- పార్లమెంట్ మళ్లీ చట్టాన్ని అమలు చేసి త్రీ క్యాపిటల్ అని ఉంటే అప్పుడు మీరు చేసుకోవచ్చు కానీ అంతవరకు అసెంబ్లీ కూడా ఎటువంటి చట్టం చేయడానికి అర్హత లేదని చెప్పింది.
- అమరావతి ప్రాంత రైతులకు ఎకరం కవులు గుత్త లక్ష రూపాయలు వచ్చేది.దాన్ని కూడా వదులుకొని రాష్ట్ర ప్రగతి కోసం భూములు ఇచ్చారు.
- అమరావతి ఉద్యమం చేస్తున్న మహిళలను అనేక పదాలతో చెప్పరాని మాటలు మాట్లాడుతున్నారు.
- కొంత సమయం పట్టొచ్చుగా ఎట్టి పరిస్థితుల్లో అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉంటుంది.
- త్వరలోనే సుప్రీంకోర్టులో రాజధాని అనుకూలంగా తీర్పువస్తుంది అని ఆశాభావం.
- గవర్నర్ స్పెషల్ సెక్రటరీని పిలిచి ఉద్యోగులకు జీతాలు ఒకటవ తేదీ జితం ఇవ్వని పరిస్థితిల్లో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి వస్తుందని చెప్పడం జరిగింది దీనికి ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాల్సింది.
- రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి మీరు అమరావతి ప్రాంత రైతులకు కూడా మంచి రోజులు రాబోతున్నాయి.