ఫిబ్రవరి 6 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తా అంతకంటే ముందు ఈ నెల 26న హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభిస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు.ఫిబ్రవరి 6 నుంచి రెండు నెలల పాటు పాదయాత్ర ఉంటుందని, హాత్ సే హాత్ జోడోలో భాగంగా పాదయాత్ర చేస్తానని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. భద్రాచలం (Bhadrachalam) నుంచి తాను పాదయాత్రను ప్రారంభిస్తానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. భద్రాచలంలో భారీ బహిరంగ సభకు ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) హాజరవుతారని, ఠాక్రే భేటీకి మూడుసార్లు రాని నేతల నుంచి వివరణ తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పారు. కీలక సమయాల్లో సమావేశాలకు రాని నేతలను పార్టీ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.