నాంపల్లి ఎక్సిబిషన్ పార్కింగ్ లో అగ్నిప్రమాదం సంభవించింది. పక్కన పార్కింగ్ లో ఉన్న కారులో నుండి ఒక్కసారిగా మంటలు రావడం ప్రారంభం అయ్యాయి.అది చూసి స్థానికులు ఆందోళన చెందారు. ఎలక్ట్రికల్ కార్ లో నుండి మంటలు వ్యాపించినట్లుగా సమాచారం అంది వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్తలనికి చేరుకున్నారు. మంటలు ఒక కారునుండి మరో నాలుగు కార్లకు చెలరేగాయి, తక్షణమే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది,అబిడ్స్ పోలీసులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించి అక్కడి పరిస్తితి ని చక్కదిద్దారు. దీనితో నాంపల్లి పరిసర ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.