శ్రీవారి ఆలయంపై డ్రోన్ దృశ్యాల వ్యవహారంపై కిరణ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కిరణ్ పై IPC సెక్షన్ 447 కింద కేసు నమోదు చేసిన పోలీసులు డ్రోన్ కెమెరాతో శ్రీవారి ఆలయ దృశ్యాలు చిత్రీకరించినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అయితే ఈ వీడియో గ్రుహ శ్రీనివాసా, ఐకాన్ ఫ్యాక్ట్ అకౌంట్ లో వీడియో పోస్ట్ చేసినట్లు ఎఫ్ఐఆర్ లో పోలీసులు చూపించినట్లు తెలుస్తోంది. టెంపుల్ సెక్యూరిటీ ఉల్లంఘన, అసాంఘిక శక్తులకు ప్రయోజనం చేకూర్చేలా వ్వహరించినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.