- తిరుమలలో జనవరి 23న ఉదయం 10 గంటలకు ఫిబ్రవరి నెల కొరకు వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన వికలాంగుల కోటా విడుదల
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఫిబ్రవరి నెల 1 వ తేదీ నుండి 21 వ తేదీ వరకు ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జనవరి 23 సోమవారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది. ఫిబ్రవరి 22 వ తేదీ నుండి 28 వ తేదీ వరకు బాలాలయం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ తేదీ లలో కోట విడుదల చేయటం లేదు.