రాష్ట్రం క్రమేణా అనారోగ్య ఆంధ్ర ప్రదేశ్ గా మారిపోతూ వుంది.రాష్ట్రం లో బిపి,సుగర్ వ్యాధిగ్రస్తుల శాతం క్రమేణా పెరుగుతూ ఉంది.
NFHS సర్వే ప్రకారం బిపి కేసుల శాతం జాతీయ స్థాయిలో 25 శాతం కాగా ఆంధ్రప్రదేశ్ లో36.49 శాతం.సుగర్ రోగుల శాతం జాతీయ స్థాయిలో 27 శాతం కాగా ఆంధ్ర ప్రదేశ్ లో34.11 శాతం.
దీనికి కారణం మన ఆహారం లో చిరుధాన్యాలు వాడకం తగ్గి పాలిష్ చేసిన బియ్యం వాడకం మరీ ఎక్కువ కావడం.చౌక ధరల దుకాణాల ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం తో పాటు చిరు ధాన్యాలు సరఫరా చేయాలి.చిరు ధాన్యాల వినియోగం పై అవగాహన పెంచాలి.వైకాపా పాలనలో మొత్తం బడ్జెట్ లో పెట్టుబడి వ్యయం తగ్గిపోవడం గర్హనీయం.దీనివల్ల రాష్ట్రం లో అభివృద్ది ఆగిపోయింది.
పెట్టుబడి వ్యయం.
2018-2019 లో రు20,002 కోట్లు.
2019-20 లోరు12,244 కోట్లు
2020-2021 లో రు18,975 కోట్లు
2021-22 లో రు16,372 కోట్లు.
పెట్టుబడి వ్యయం పెంచితెనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.