గురువారం స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్ ని, బీ.సీ సంఘ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా బీ.సీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శేకుబోయిన సుబ్రమణ్యం మాట్లాడుతూ రాత్రి 8 గంటల తర్వాత గుడివాడ నుంచి మచిలీపట్నం రావడానికి గతంలో బస్సు సౌకర్యం లేదన్నారు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని తెలిపారు. సంబంధిత అంశంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని, డిపో మేనేజర్ పెద్దిరాజు లకు వినతి పత్రం సమర్పించామన్నారు. వినతిపై తక్షణమే స్పందించి ప్రయాణికుల ఇబ్బంది దృష్ట్యా రాత్రి 9 గంటల సమయంలో గుడివాడ నుంచి మచిలీపట్నం కు మరొక బస్సు ఏర్పాటు చేయడం పట్ల మాజీ మంత్రి పేర్ని నాని, డిపో మేనేజర్ లకు, సుబ్రమణ్యం కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం బీ.సీ నాయకులు డిపో మేనేజర్ ను పుష్పగుచ్చం, దుశ్శలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమం లో బి. సి పట్టణాధ్యక్షులు తోట బాబు, వేముల బుజ్జి, చేబోయిన కోటేశ్వరరావు, విశ్వనాధపల్లి సుబ్రహ్మణ్యం, జన్ను గోవిందు, పుట్టి రాజేశేఖర్, బోయిన రమేష్, ఎం. పవన్, పోలగాని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.