- అర్ధరాత్రి నడిరోడ్డుపై డీసీడబ్ల్యూ చీఫ్..
- లైంగిక వేధింపులు, కారుతో ఈడ్చుకెళ్లిన తాగుబోతు
ప్రముఖ ఉద్యమకారిణి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ భయానక అనుభవం ఎదుర్కొన్నారు. ఓ యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన చంపిన ఘటన తర్వాత.. ఢిల్లీలో మహిళల భద్రతను పర్యవేక్షించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు ఆమె. అయితే.. ఈ ప్రయత్నంలో కారులో తప్పతాగి వచ్చిన ఓ వ్యక్తి నడిరోడ్డుపై ఆమెను లైంగికంగా వేధించడంతో పాటు ప్రతిఘటించడంతో కొద్దిదూరం అతని కారుతో సహా లాక్కెల్లాడు. ఈ ఘటన నుంచి ఆమె సురక్షితంగా బయటపడగా.. ఆమె ఆ భయానక అనుభవాన్ని పంచుకున్నారు.