ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ అయింది .. తర్వాత సభ విశాఖలో నిర్వహించనున్నారు .. దాంతో ఏపీలో తన జాతీయ పార్టీ బీఆర్ఎస్ ను గ్రాండ్ గా ఎంట్రీ ఇప్పించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది… ఇదే క్రమంలో ఇప్పటికే ఏపీలో చర్చనీయాంశమవుతున్న పలు సమస్యలపై అధ్యయనం చేస్తున్నారంట.. ఇప్పటికే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించిన కేసీఆర్.. ఇదే క్రమంలో రాష్ట్రంలో ఓ కీలక సమస్యపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారంట … ఆ ఇష్యూతో ఏపిలోని అన్ని పార్టీలను డిఫెన్స్‌లోకి నెట్టడమే ఆయన వ్యూహంగా కనిపిస్తోంది…
ఖమ్మం సభ విజయవంతం అవ్వడంతో బీఆర్ఎస్ వర్గాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది … ఆ సభకు ఏపీ నుంచి సైతం జనం భారీగా తరలి వచ్చారు .. దాని వెనుక ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించారంట … ఇప్పుడు ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. అతి త్వరలో విశాఖలో బీఆర్ఎస్ సభ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు… అది పూర్తిగా తోట చంద్రశేఖర్ కనుసన్నలలోనే జరగనుంది.ఈ సభ ద్వారా బీఆర్ఎస్ అజెండాను కేసీఆర్ ఏపీ ప్రజలకు వెల్లడించబోతున్నారంట … తన అజెండాలో కేసీఆర్ ఓ కీలక అంశాన్ని టచ్ చేయబోతున్నారంట… ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎంట్రీ అందరికీ తెలిసేలా చేసేందుకు ఈ అంశం ఉపయోగపడుతుందని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది … దీనికి సంబంధించిన హింట్ ను తాజాగా నిర్వహించిన ఖమ్మం సభలో కేసీఆర్ ఇచ్చేశారు.
ఏపీలో ప్రస్తుతం నెలకొన్న కీలక సమస్యల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒకటి … దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం చాలా సులువుగా ప్రైవేటీకరణ చేసేస్తుంటే ఎవరూ నోరు మెదపలేని పరిస్ధితి … మొదట్లో కార్మికుల ఆందోళనతో సంఘీభావం ప్రకటించిన జగన్, చంద్రబాబు, పవన్ వంటి వారు ఇప్పుడు దానిపై పెద్దగా మాట్లాడటం లేదు … దీంతో ఇదే అంశాన్ని తనకు అనుకూలంగా మల్చుకునేందుకు కేసీఆర్ సిద్దమవుతున్నారంట.. అందుకే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తే తాము తిరిగి జాతీయీకరణ చేస్తామని ఖమ్మం సభ వేదికగా కేసీఆర్ ప్రకటించారు.
ఏపీలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ రాక వెనుక సీఎం జగన్ హస్తం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి …. కాపుల ఓట్లు చీల్చేందుకే బీఆర్ఎస్ ఏపీలో అడుగుపెడుతోందని జనసేన, టీడీపీ విమర్శిస్తున్నాయి …ఈ తరుణంలో ఏపీలో కేసీఆర్ కు అసలు మిత్రులెవరన్న చర్చ మొదలైంది … అవేమీ పట్టించుకోని కేసీఆర్ తనదైన స్ట్రాటజీతో ముందుకు పోతున్నట్లు కనిపిస్తున్నారు …
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేసీఆర్ ఎంట్రీ తర్వాత కచ్చితంగా దానిపై అందరూ మాట్లాడక తప్పని పరిస్దితి వస్తుంది. అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా వారిలో ఎవరు నోరు విప్పితే వారే కచ్చితంగా బీఆర్ఎస్ మిత్రులు అయ్యే అవకాశం ఉందంటున్నారు … దీంతో ఏపీలో మిత్రుల్ని తేల్చేందుకు కేసీఆర్ ఈ వ్యహం ఎంచుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి…
అయితే ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీపై అధికార వైసీపీతో పాటు టీడీపీ, జనసేన కూడా లైట్ తీసుకుంటున్నాయి. బీఆర్ఎస్ రాకతో బీజేపీకి వ్యతిరేకంగా తాము నోరు విప్పాల్సిన పరిస్దితులు ఉంటాయనే విషయాన్ని వారు అంత సీరియస్ గా తీసుకోవడం లేదు…. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సీరియస్ గా పోరాటం మొదలుపెడితే మాత్రం కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టులు కేసీఆర్ తో కలిసి రావడం ఖాయం … ఇప్పటికే తెలంగాణాలో కమ్యూనిస్టులతో కలిసి సాగుతున్న కేసీఆర్ కు ఏపీలోనూ వారు సహజమిత్రులే అవుతారు … మరి ఇంకెన్ని పార్టీలు కేసీఆర్ వ్యూహంతో తమ స్టాండ్ మారుస్తాయో చూడాలి