- కాకినాడలో భారీ పారిశ్రామిక పార్కు
- 50 వేల మందికి పైగా ఉపాధి
- ఇప్పటికే 2,000 కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్ ఫార్మా ప్రాజెక్ట్ ప్రారంభం
- రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో కీలక అడుగు
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడనుంది. భారీ పెట్టుబడులతో కృష్ణా, గోదావరి బేసిన్ లో ఏర్పాటు కానున్న పారిశ్రామిక పార్కు రాష్ట్రానికి తలమానికం కానుంది. మొత్తం 7,440 ఎకరాల విస్తీర్ణంలో గల కాకినాడ సెజ్ లో భారీ సంస్ధలు పెట్టుబడులు పెట్టనున్నాయి. మొత్తం ఈ పారిశ్రామిక పార్కులో వచ్చే పెట్టుబడుల ద్వారా దాదాపుగా 25,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, మరో 25,000 పరోక్ష ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఈ ప్రధాన సెజ్ రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు బాటులు వేయనుంది.
ఇప్పటికే భారీ చమురు, సహజ వాయువు నిల్వలు గ్యాస్ ఆధారిత పరిశ్రమలు కేజీ బేసిన్ ల వద్ద నెలకొన్నాయి. తాజాగా కేంద్ర రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ ఈ సెజ్ లోనే బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రెండు జాతీయ సంస్థలు, ది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ & ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్.