- ఘనంగా కోడి రామ్మూర్తి వర్ధంతి వేడుకలు
- ప్రపంచ వ్యాయామ విద్య కే తలమానికం కోడి రామ్మూర్తి.
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చెందిన కోడి రామ్మూర్తి నాయుడు ఆయన వర్ధంతి వేడుకలు ను సోమవారం సెవెన్ రోడ్ జంక్షన్ వద్ద గల లిఖిత్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పత్రిక విలేకరులకు ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు, అంతర్జాతీయ స్థాయి మలయోధుడిగా పేరుగాంచిన కోడి రామమూర్తి నాయుడు వర్ధంతి వేడుకలను జిల్లాలో నిర్వహించకపోవడం పైన తీవ్ర విచారం వ్యక్తం చేశారు, ఇప్పటికే జిల్లాలో ఉండే కోడి రామ్మూర్తి నాయుడు ఏకైక క్రీడా ప్రాంగణమైన అభివృద్ధికి నోచుకుపోవడంపై చాలా విచారకరమని ఈ సందర్భంగా తెలియజేశారు, ఎప్పటికైనా పాలక ప్రభుత్వం స్పందించి తక్షణమే కోడి రామ్మూర్తి క్రీడా ప్రాంగణాన్ని నిర్మించి క్రీడాకారులకు అందజేయాలని ఈ సందర్భంగా తెలిపారు , ఈ కార్యక్రమంలో ముత్తు రెడ్డి గురునాధరావు, ఇంటి గోపి, ముత్తు రెడ్డి దుర్గాప్రసాద్, ముత్తిరెడ్డి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.