కుటుంబ_ధ్రువీకరణ పత్రం విషయంలో ఏ.పి హైకోర్టు తీర్పు జివో నెం 145ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది…!
ఎవరైనా చనిపోతే ఇచ్చే ఫ్యామిలీ సర్టిఫికెట్,లేదా వారసత్వానికి సంబంధించి ఇచ్చే సర్టిఫికెట్లతో రెవెన్యూ అధికారులు చాలా వరకు సొమ్ము చేసుకుంటారు.దీనిపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.కుటుంబ సభ్యులకు ఇచ్చే సర్టిఫికెట్లకు సంబంధించి వారు కుటుంబ సభ్యుల కాదా అనేది మాత్రం చెబితే చాలు.వారి మధ్య ఆస్తి పంపకాలు,ఇతర వివాదాలకు వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.ఈ ధ్రువప్రతాన్ని ఇచ్చే జివో నెం 145ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
చట్టబద్ధంగా అందాల్సినవి కొంతమందికి అందకుండా వారి కుటుంబ సభ్యులే అడ్డుకుంటున్నారని ఆక్షేపించింది. చట్టాలు ఉన్నవి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికే కాని అడ్డుకోవడానికి కాదని తేల్చి చెప్పింది. ఇలాంటి విషయాల్లో అధికారులు ఏ మాత్రం సహకరించరాదని చెప్పేసింది. దీనిపై జస్టిస్ ఘన్నమనేని రామకృష్ణ కీలక తీర్పునిచ్చారు.విశాఖ జిల్లాకు చెందిన బంగారు రాజ్ జ్యోతికి 2019 డిసెంబర్ 6న వివాహం జరిగింది. విశాఖజిల్లా మహిళా సెషన్స్ కోర్టులో బంగార్ రాజు పనిచేసేవాడు. ఈయన కోవిడ్ తో 2021 మే 21 మరణించాడు.కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలని భార్య ఆర్జీ పెట్టుకున్నారు.
దీనికి సంబంధించి కుటుంబ ధ్రువీకరణ పత్రం చూపించాలని కోర్టు సూచించింది. జ్యోతి తహసీల్దార్ ను ఆశ్రయించారు. జ్యోతి అత్త అడ్డుకోవడంతో మాకవారిపాలెం తహసీల్దార్ ధ్రువపత్రం ఇవ్వడానికి నిరాకరించారు.బాధితురాలు ఈ విషయమై నర్సీపట్నం జిల్లా న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో జ్యోతి హైకోర్టుకు వెళ్లడంతో పిటిషనర్ తరపున వాదనలు విన్న న్యాయమూర్తి పెళ్లయిన ఓ మహిళకు ఆమె కేవలం కుటుంబ సభ్యురాల కాదా అన్నది మాత్రమే రెవెన్యూ శాఖ తేల్చి చెప్పాలి.కానీ ఇతర వివాదాలకు వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదని అత్త చెప్పినట్లు అధికారులు విని కుటుంబ ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవడం ఏ మాత్రం సబబు కాదని చెప్పింది.