టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలని టీడీపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ వైనాట్ 175-175 ఎందుకు రావు. 175కి 175 సీట్లు సాధించాలని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్య నేతలకు పిలుపునిస్తున్నారు.నా పని నేను చేస్తున్నా,మీ పని మీరు చేస్తే 175 సాధించడం సులువే అంటూ జగన్ ఉద్భోదిస్తున్నారు.సరిగ్గా ఇప్పుడు చంద్రబాబు నోటివెంట కూడా 175 సీట్ల మాట రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.అంటే టిడిపి పొత్తులు లేకుండానే బరిలోకి దిగుతుందా?
సంక్రాంతి సంబరాలను జరుపుకోవడానికి బాలకృష్ణ కుటుంబంతో కలిసి తన కుటుంబంతో సహా చంద్రబాబు తన స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెకు వెళ్లారు…. అక్కడ ఘనంగా పండుగ సంబరాలు జరుపుకున్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. …వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు …. మరోవైపు ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ 160 సీట్లు సాధిస్తుందని చెబుతున్నారు.ఇంకోవైపు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతోంది …. విశాఖ పరిణామాల తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ ను చంద్రబాబు కుప్పం పరిణామాల తర్వాత చంద్రబాబును పవన్ కల్యాణ్ కలిశారు…. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య అనేక అంశాలు చర్చకొచ్చాయన్న ప్రచారం ఉంది.ముఖ్యంగా పొత్తు దిశగానే ఇద్దరు నేతలు పరోక్ష వ్యాఖ్యలు చేశారు… వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోనని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. ..మరోవైపు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అన్ని పార్టీలు కలసి రావాలని చంద్రబాబు సైతం పిలుపునిచ్చారు…గతంలో సైతం పొత్తుల విషయంలో చంద్రబాబు మాట్లాడుతూ తనది వన్ సైడ్ లవ్ అని టూ సైడ్ లవ్ ఉంటేనే పొత్తులు ఉంటాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువశక్తి సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ గౌరవప్రదంగా పొత్తులు ఉండాలని వ్యాఖ్యానించారు. గౌరవప్రదంగా ఉంటే మిశ్రమ ప్రభుత్వం వస్తుందని.. లేదంటే జనసేనది ఒంటరి పోరాటమని తేల్చిచెప్పారు.మరోవైపు టీడీపీ జనసేన పొత్తు కుదిరిందని అసెంబ్లీ స్థానాలు పార్లమెంటు స్థానాలు జనసేనకు ఇన్ని కేటాయించారంటూ ఒక ప్రచారం సాగుతోంది.ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు 175కి 175 స్థానాలు టీడీపీ గెలుచుకోవాలని చెప్పడం ఆసక్తికరంగా మారింది. మరి జనసేనతో పొత్తు లేనట్టేనా? లేదంటే జనసేనతో కలిపే 175 సీట్లను సాధించాలనేది చంద్రబాబు ఉద్దేశమా అన్నది చర్చనీయాంశంగా మారింది