తాను కూడా మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చానని, వారి బాధలు ఏంటో తెలుసని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మధ్యతరగతి ఒత్తిళ్లను తాను అర్థం చేసుకున్నానని, వారిపై ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా ఎలాంటి పన్ను విధించలేదని గుర్తు చేశారు. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2023-24 బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.