- కొలతలు తీసుకుంటానన్న బాలయ్య.. పగలబడి నవ్విన పవన్!
- పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది.
- ఎన్బీకే అన్‌స్టాపబుల్ పవన్ కల్యాణ్ గ్లింప్స్ రిలీజయ్యింది.
- దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
- ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ గురించి ఓ లేటెస్ట్ అప్డేట్ రిలీజ్ చేసింది ఆహా టీమ్.
- ఎన్బీకే అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఎపిసోడ్‌కి సంబంధించిన ఆ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
- ‘నేను నీ కొలతలు తీసుకుంటా’ అంటూ బాలయ్య అనగానే.. పవన్ కల్యాణ్ పగలబడి నవ్వారు.
- గ్లింప్స్ రిలీజయ్యేకంటే ముందు నుంచే సంబరాలు చేసుకున్నారు ఫ్యాన్స్.
- ట్విట్టర్లో హ్యాష్‌ట్యాగులతో ట్రెండింగ్ సైతం చేశారు.
- గ్లింప్స్‌లో పవన్ అవుట్‌ఫిట్ కేక అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
- మరోవైపు ఎపిసోడ్లో ఎటువంటి ప్రశ్నలు ఉండనున్నాయో అని ఆసక్తి కనబరుస్తున్నారు.