రెండ్రోజుల పాటు ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. తెలంగాణ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay), కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ (DK Aruna), మురళీధరరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి (Ponguleti Sudhakar Reddy), జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి, జితేందర్‌రెడ్డి, వివేక్ తదితరులు సమావేశాల్లో పాల్గొననున్నారు. సమావేశాల్లో బండి సంజయ్ పాదయాత్రపై ఏవీ ప్రదర్శన ఉండే అవకాశం ఉంది. ప్రజా సంగ్రామయాత్ర తరహాలో ఇతర రాష్ట్రాలలో పాదయాత్రలకు బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. సంజయ్ పాదయాత్ర జరిగిన తీరు.. ఏర్పాట్లపై ఇప్పటికే రాష్ట్రంలో తమిళనాడు బీజేపీ ప్రతినిధులు పర్యటించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, తీర్మానాలపై సమావేశాల్లో అజెండా ఖరారు చేయనున్నారు. అలాగే వచ్చేనెలాఖరుతో జేపీ నడ్డా పదవీకాలం ముగియనుంది. ఈ సమావేశాల్లో నడ్డా పదవీకాలం పొడిగించే అవకాశం ఉంది.