తమిళనాడు మదురై జిల్లాలోని అవనీయపురం జల్లికట్టు ఆటకు కేరాఫ్ అడ్రస్. ఆదివారం జరిగిన జల్లికట్టు పోటీల్లో 60 మందికి పైగా గాయపడ్డారు. 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. జల్లికట్టు ఫైనల్స్ కోసం 1500 మంది పోలీసులతో భారీ భద్రత కల్పించారు. 40 ప్రత్యేక మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేశారు. బెదిరిపోతూ పరుగులు తీసిన ఎద్దులు, వాటిని పట్టుకునేందుకు యువకుల సాహసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.