• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home వినోదం

వీరసింహారెడ్డి ఊహించినదాని కంటే పెద్ద విజయం సాధించింది-గోపీచంద్ మలినేని

pd_admin by pd_admin
January 14, 2023
in వినోదం
0 0
0
veera simha reddy

veera simha reddy

Contents

  • 1 వీరసింహారెడ్డి’ని ఒక బాధ్యతగా చేశా. మేము ఊహించినదాని కంటే పెద్ద విజయం సాధించింది : దర్శకుడు గోపీచంద్ మలినేని ఇంటర్వ్యూ
    • 1.1 ‘వీరసింహారెడ్డి’ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?
    • 1.2 రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ కి మంచి ఆదరణ వచ్చింది కదా ?
    • 1.3 బాలకృష్ణ గారి లుక్ ఎలా డిజైన్ చేశారు ?
    • 1.4 సిస్టర్ సెంటిమెంట్ ఇంత అద్భుతంగా వర్క్ అవుట్ అవుతుందని ముందే భావించారా ?
    • 1.5 ఇందులో డైలాగులకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.. ముఖ్యంగా పొలిటికల్ డైలాగులు.. దిని గురించి ?
    • 1.6 క్రాక్ తర్వాత ఇందులో మీ అబ్బాయి చక్కగా నటించాడు కదా ?

వీరసింహారెడ్డి’ని ఒక బాధ్యతగా చేశా. మేము ఊహించినదాని కంటే పెద్ద విజయం సాధించింది : దర్శకుడు గోపీచంద్ మలినేని ఇంటర్వ్యూ

గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మాసియస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీరసింహారెడ్డి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించిన ‘వీరసింహారెడ్డి’ నిన్న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై.. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అన్ని చోట్ల రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో వీర మాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలో దర్శకుడు గోపీచంద్ మలినేని విలేఖరుల సమావేశంలో వీరసింహారెడ్డి విశేషాలని పంచుకున్నారు ?

‘వీరసింహారెడ్డి’ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?

చాలా ఆనందంగా వుంది. వీరసింహారెడ్డి ని ఒక అవకాశం కంటే ఒక బాధ్యతగా చూశాను. బాలకృష్ణ గారు అఖండ అద్భుతమ విజయం, అన్ స్టాపబుల్ షోతో మాస్ , యూత్, ఫ్యామిలీ అనే తేడా లేకుండా అందరిలోకి వెళ్ళిపోయారు.. అందరూ కనెక్ట్ అయిపోయారు. ఇలాంటి సమయంలో నా సినిమా పడటం నా అదృష్టం. ఇప్పుడు అందరి హీరోల ఫ్యాన్స్ బాలయ్య బాబు అభిమానులే. దిని ద్రుష్టిలో పెట్టునిని, ఆయన గాడ్ అఫ్ మాసస్ ఇమేజ్ , నా ఫ్యాన్ మూమెంట్స్ ద్రుష్టిలో పెట్టుకొని ఈ కథని చేశాను. ఇందులో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ గా సిస్టర్ సెంటిమెంట్ కూడా పెట్టాం. ఇంటర్వెల్ లో బాలయ్య బాబు కన్నీళ్లు పెట్టుకున్న ఎపిసోడ్, అలాగే హనీ రోజ్ తో మాట్లాడిన సన్నివేశాలు.. ఫ్యామిలీ ఆడియన్స్ చక్కగా ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ గారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ సమరసింహా రెడ్డి, నరసింహా నాయుడు చిత్రాలలో ఫ్యామిలీ ఎమోషన్ వుంటుంది. వీరసింహా రెడ్డిలో కూడా అది అద్భుతంగా కనెక్ట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఫ్యాన్స్ అందరూ ఇరగదీశారని కాంప్లీమెంట్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్ ఇంకా గొప్పగా కనెక్ట్ అయ్యింది.

రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ కి మంచి ఆదరణ వచ్చింది కదా ?

రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ తో నాకు మంచి రేపో వుంది. క్రాక్ ఫైట్స్ అన్నీ వాళ్ళే చేశారు. వాళ్ళు కథతో పాటే వెళ్తారు. యాక్షన్ ని కూడా ఒక సీన్ లా డిజైన్ చేస్తారు. ఎమోషన్ ని వదలరు . ఇందులో ఫైట్స్ అన్నీ ఎక్స్ ట్రార్డినరీ గా చేసారు.

బాలకృష్ణ గారి లుక్ ఎలా డిజైన్ చేశారు ?

బ్లాక్ షర్టు తో ఫస్ట్ పోస్టర్ ని విడుదల చేశాం,. దిని వెనుక పెద్ద వర్క్ వుంది. ఆయన సినిమాలన్నీ చూస్తూ పెరిగాం, ఆయన ఎక్స్ ట్రార్డినరీ లుక్స్ ఏమిటనేదానిపై ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టి ఈ లుక్ ని డిజైన్ చేశాం. థియేటర్ లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. బాలకృష్ణ గారు వెరీ హ్యాండసమ్ . ఆయనది చాలా అందమైన ముఖం. ఆయనకి సరైన లుక్ కుదిరితే నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. ఇప్పుడు రాష్ట్రాల వ్యాప్తంగా ఎక్కడ చూసిన బ్లాక్ షర్టు, బ్లాక్ గ్లాసస్ తో స్టిల్ పడుతుందంటే జనం వోన్ చేసుకుంటేనే ఆ స్టిల్ పడుతుంది. ఇది ఆయన సిగ్నేచర్ స్టిల్ అవ్వడం చాలా ఆనందంగా వుంది.

సిస్టర్ సెంటిమెంట్ ఇంత అద్భుతంగా వర్క్ అవుట్ అవుతుందని ముందే భావించారా ?

కథని బలంగా నమ్మి చేసిన చిత్రమిది. బ్రదర్ సిస్టర్ ఎమోషన్ ని నిజాయితీగా బలంగా నమ్మి చేస్తామో ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారనే నమ్మకం వుండేది. మా నమ్మకం నిజమైయింది. మేము ఊహించిన దాని కంటే ఎక్కువ అప్లాజ్ వచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులు కంటతడి పెట్టుకొని ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే చాలా ఎమోషనల్ గా అనిపించింది. మేము అనుకున్న ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. సిస్టర్ పాత్ర కోసం వరలక్ష్మీ శరత్ కుమార్ ని అనుకున్నప్పుడు బాలకృష్ణ మరో ఆలోచన లేకుండా ఓకే అన్నారు. అప్పటికే ఆయన క్రాక్ చూశారు.వరలక్ష్మీ చేయగలదనే నమ్మకం వుంది. యాంటి సిస్టర్ సెంటిమెంట్ వున్న ఆ పాత్రని వరలక్ష్మీ ఎక్స్ ట్రార్డినరీగా చేసింది.

ఇందులో డైలాగులకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.. ముఖ్యంగా పొలిటికల్ డైలాగులు.. దిని గురించి ?

కథ నుండి పుట్టిన డైలాగులవి. ఏది వాంటెడ్ గా పెట్టలేదు. కథలో అంత సహజంగా వున్నాయి కాబట్టే ప్రేక్షకులందరూ ఇంత గొప్పగా ఆదరిస్తున్నారు.

క్రాక్ తర్వాత ఇందులో మీ అబ్బాయి చక్కగా నటించాడు కదా ?

వీరసింహరెడ్డిని మరోసారి ఇలివేట్ చేస్తూ పరిచయం చేసే పాత్ర కోసం ఓ పిల్లాడు కావాలి. దినికి మావాడు సరిగ్గా సరిపోతాడని నాకు తెలుసు.(నవ్వుతూ) అలా ఇందులోకి మా అబ్బాయి వచ్చాడు. చక్కగా చేశాడు.

సెకండ్ హాఫ్ లో రెండు సీన్లులో బాలకృష్ణ గారి డైలాగ్స్ వుండవు? కేవలం ఎక్స్ ప్రెషన్స్ తోనే చక్కగా ఎలా బ్యాలెన్స్ చేశారు ?

బాలకృష్ణ గారు ఎక్స్ ట్రార్డినరీ. అలా ఎక్స్ ప్రెషన్స్ తో అంత గొప్పగా చేయడం ఆయకే సాధ్యం.

బోయపాటి తర్వాత బాలకృష్ణ గారిని ఇంత అద్భుతంగా చూపించింది మీరే అనే అప్లాజ్ వస్తోంది. మీరు బాలకృష్ణ గారి ఫ్యాన్ వలనే ఇలా చూపించారా ?

అవును. ఒక దర్శకుడిగా నాలో చాలా మాస్ వుంది. ఈ కథకు ఎంత కావాలో అంత తీసుకొచ్చాను. ఫస్ట్ హాఫ్ ఫ్యాన్ బాయ్. సెకండ్ హాఫ్ డైరెక్టర్.

తమన్ గారి మ్యూజిక్ గురించి ?

మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి వున్న అవగాహన ప్రేమ నమ్మకం వేరు. నేను ఒకరిని కనెక్ట్ అయితే వదలను. నా అన్ని సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్. నేను మనుషుల్ని వదులుకోను. తమన్ ని నాకు ప్రత్యేకమైన అనుబంధం వుంది. నేను మ్యూజిక్ చేయడానికి స్పేష్ ఇవ్వడం తమన్ కి నచ్చుతుంది. ఇందులో బాలయ్య బాబుకి ఇచ్చిన ఎలివేషన్ కి ఎంత మ్యూజిక్ ఇచ్చిన సరిపోవడం లేదని చెప్పేవాడు చాలా లైవ్ వర్క్ చేశాడు. లైవ్ చేయకపోతే ఇంత మ్యూజిక్ రాదు. జై బాలయ్య పాట ఎక్కడికి వెళ్ళిన మ్రోగుతూనే వుంటుంది.

మైత్రీ మూవీ మేకర్స్ గురించి ?

నా కెరీర్ లో బెస్ట్ ప్రోడ్యుసర్స్ మైత్రీ మూవీ మేకర్స్. వాళ్ళతో సినిమాలు చేస్తూనే వుంటాను. నా క్రాక్ మూవీ రిలీజ్ కాకముందే నవీన్ గారు మా సినిమా చేయాలని చెప్పారు. క్రాక్ సినిమాకి ముందే నన్ను ఫిక్స్ చేసుకున్నారు. నా మీద వాళ్ళకి వున్న నమ్మకం ఇది. అంత గొప్ప అనుబంధం వారితో వుంది. అద్భుతమైన నిర్మాతలు. రెండు పెద్ద సినిమాలు చేస్తున్నప్పటికీ ఎంతో బ్యాలెన్స్ గా రిలీజ్ చేయడం మామూలు విషయం కాదు. రియల్లీ హ్యాట్సప్ .

కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?

ప్రస్తుతం వీరసింహా రెడ్డి సక్సెస్ ని ఒక ఫ్యాన్ గా ఎంజాయ్ చేస్తున్నా

Tags: ఊహించినదానికంటేపెద్దమలినేనివిజయంవీరసింహారెడ్డివీరసింహారెడ్డి ఊహించినదాని కంటే పెద్ద విజయం సాధించింది-గోపీచంద్ మలినేనిసాధించింది-గోపీచంద్

Recent Posts

  • కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు దక్కించుకోబోయే నేతలు ఎవరు…?
  • చక్రం తిప్పునున్న కేటీఆర్ ! కష్టం ఫలించేనా?
  • రాజకీయం కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం – జనసేనాని పవన్ కళ్యాణ్
  • మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ..17న బడ్జెట్
  • నవజీవన్ ఎక్స్‎ప్రెస్ రైలులో పొగలు..పరుగులు పెట్టిన ప్రయాణికులు

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In