డిపాజిట్, విత్‌డ్రాల ట్రాకింగ్:
ఇప్పటికే కొన్ని జాతీయ, ప్రైవేట్ బ్యాంకులు ఈ విధానాన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది తప్పనిసరి కానప్పటికీ పాన్ కార్డ్‌ను బ్యాంకు ఖాతాతో జోడించని వినియోగదారులను ఈ పద్ధతిలో అనుసంధానం చేయనున్నారు. ఆధార్ కార్డుతో బ్యాంకు ఖాతాలు ఇప్పటికే అనుసంధానమైనందున.. ఎక్కువ డిపాజిట్లు, విత్‌డ్రాలు చేసే వారిని తేలికగా గుర్తించే అవకాశం ఫేస్ రికగ్నిషన్, ఐరిస్ స్కాన్ ద్వారా లభిస్తుంది.
త్వరలో కొత్తం చట్టం:
గోప్యత, సైబర్ భద్రత, ఫేస్ రికగ్నిషన్‌పై ఇప్పటి వరకు ప్రత్యేక చట్టం లేనందున పలు ఇబ్బందులు తలెత్తవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తదనుగుణంగా ఈ ఏడాది ప్రారంభంలోనే కొత్త చట్టం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ధృవీకరణ తప్పనిసరి…
కొన్ని సందర్భాల్లో వేలిముద్రల ద్వారా ధృవీకరణ విఫలమవుతున్నందున.. ఆ స్థానంలో ఫేస్ రికగ్నిషన్, ఐరిస్ స్కాన్‌లు వినియోగించేందుకు చూడాలని ఇప్పటికే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆర్థిక శాఖకు లేఖ రాసింది. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆ శాఖ బ్యాంకులకు సైతం సూచించింది. ఏదేమైనా ఆధార్ ధృవీకరణ, ప్రామాణీకరణలు వినియోగదారుని అనుమతితో మాత్రమే జరుగుతాయని UIDAI ప్రతినిధి తెలిపారు.