- అరకులో ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు
- కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
- ప్రియాంక గాంధీ ఔనత్యాన్ని కొనియాడిన కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ డెలిగేట్ పాచిపెంట చిన్నస్వామి.
అరకు వేలి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత్రి ప్రియాంక గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్టి విభాగ రాష్ట్ర చైర్మన్ గౌరవ పాచిపెంట శాంత కుమారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ డెలిగేట్ పాచిపెంట చిన్నస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాచిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ.ప్రియాంక గాంధీ ఆరోగ్య ఐశ్వర్యములతో నిండు నూరేళ్లుమరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని భగవంతునికి కోరుకుంటున్నామని దేశం కోసం తమ నానమ్మని పోగొట్టుకున్నారని, ఆ నానమ్మ నుండి వచ్చిన మొండి పట్టుదలను పోగొట్టుకోలేదని దేశం కోసం తమ తండ్రిని త్యాగం చేశారని కానీ తమ తండ్రి చూపించిన ముందు చూపుని కాదని, అత్యున్నత పదవిని త్యాగం చేసిన అమ్మకి కూతురిగా అన్న రాహుల్ గాంధీకి చెల్లెలుగా తమని ద్వేషించిన వాళ్ళని సైతం ప్రేమించి తన ప్రజల మీద ప్రేమని మాత్రం ఎప్పుడూ ఒదులుకోలేదని అన్నారు. మనుషులందరూ ఒకేలా ప్రేమించే మంచి మనసుని కొంతమంది ఎంత నిందించినా, ఎంత ద్వేషించినా చిరునవ్వుతో భరించారని కానీ ప్రేమించటం మాత్రం మానుకోలేదని, రాజుల కుటుంబంలో పుట్టి కూడా, తమ వారసత్వాన్ని త్యాగం చేసి, ప్రజల్లో కలిసికట్టుగా ప్రజలకోసం బతుకుతున్న ప్రజా నాయకురాలు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఎంతో ఉన్నతమైన చదువులు చదివిన దేశం కోసం దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న వ్యక్తిలు ప్రియాంక రాహుల్ గాంధీలు మాత్రమేనని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శెట్టి భగత్ రాం జంపరంగి వెంకట బాబు మొస్య ప్రేమ్ కుమార్ శెట్టి రామచంద్ర టి అనిల్ డి కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.