మానసిక సమస్యల పరిష్కారానికి విజయవాడ సిద్ధార్ధ వైద్య కళాశాలలో ‘టెలీ మానస్’ కేంద్రం ఏర్పాటు.మానసిక సమస్యలున్న వారు 14416 లేదా 180089114416 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి ఉచిత టెలీ కౌన్సెలింగ్ సౌకర్యాన్ని పొందవచ్చు.ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకూ టెలీ మానస్ కేంద్రం పనిచేస్తుంది.సుశిక్షితులైన కౌన్సెలర్లు టెలిఫోన్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించి అవసరమైన సూచనలు, సలహాలిస్తారు.జనాభాలో పది శాతం మంది ప్రజలు మానసిక ఒత్తిళ్ళు, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు.వివిధ ఆర్థిక, సామాజిక సమస్యల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిళ్ళకు గురవుతున్నారు.పరీక్షలు , ఉద్యోగాన్వేషణ సమయాల్లో విద్యార్థులు తీవ్ర మానసిక వత్తిడికి గురవుతున్నారు.మానసిక ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.90 శాతం మానసిక రుగ్మతల్ని కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించి ఆత్మహత్యల్ని నివారించొచ్చు.మానసిక సమస్యలున్నవారు టెలీ మానస్ కేంద్రానికి ఫోన్ చేసి తమ విలువైన జీవితాన్ని కాపాడుకోండి.మానసిక సమస్యలతో కృంగిపోకుండా ఒక్కసారి టెలీ మానస్ కి ఫోన్ చెయ్యండి.మానసిక సమస్యలున్న వారికి ‘టెలీ మానస్’ కేంద్రం ఎల్లవేళలా అండగా నిలుస్తుంది