- టీటీడీపై బిజెపి అసత్య ఆరోపణలు దుష్ప్రచారం మానుకోవాలి
- బిజెపి నాయకులకు దమ్ముంటే, అంత శక్తి ఉంటే, భక్తులపై కేంద్రం విధించిన జీఎస్టీని రద్దు చేయడానికి కృషి చేయాలి.
- మీడియాతో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ కామెంట్స్.
- టీటీడీ వద్ద సుమారు 70 కోట్ల రూపాయలు విలువైన పాత కరెన్సీ నోట్లు ఉన్నాయి.
- ఆర్బిఐ, మరియు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో మాట్లాడి, పాత నోట్ల మార్పిడికి తమ వంతు సహకారం అందివ్వాలి.
- టీటీడీపై బిజెపి అసత్య ఆరోపణలు దుష్ప్రచారం మానుకోవాలి.
- టీటీడీ తీసుకున్న అద్దె గదుల పెంపు నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున సమర్థిస్తున్నాం.
- విమానాల్లో, లగ్జరీ బస్సుల్లో ప్రయాణం చేసి తిరుమలకు విచ్చేసి కోటీశ్వరులు బస చేసే అద్దె గదులను పెంచడంలో తప్పులేదు.
- కాంగ్రెస్ పార్టీ స్థానికుల కొరకు తీసుకొచ్చిన ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని పునరుద్ధరించాలి.
- సిమ్స్ లో తిరుపతి స్థానికులకు ఉచిత వైద్యం కల్పించాలి.
- టీటీడీ లో పనిచేసే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు అందరికీ జీతాలు పెంచాలి.