- జీవో నెంబర్ 1ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది
ప్రజాస్వామ్యాన్ని నువ్వు కాపాడు,నిన్ను ప్రజాస్వామ్యం కాపాడుతుంది.నువ్వే ప్రజాస్వామ్యాన్ని చంపేస్తే ఆ తర్వాత నిన్ను కాపాడటానికి ఆ ప్రజాస్వామ్యం బతికి రాదు’’ ఓ హక్కుల కార్యకర్త అన్న మాటలివి. 1861 పోలీస్ యాక్ట్ (Police Act)లోని సెక్షన్ 30 ప్రకారం నేతల ప్రదర్శనలు, కార్యక్రమాలపై ఏపీ ప్రభుత్వం (AP Government) నిషేధం విధించింది. చీకటి జీవో నెంబరు 1ను తక్షణమే రద్దుచేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలోనే జీవో నెంబర్ 1ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ నెల 23 వరకూ న్యాయస్థానం సస్పెన్షన్ విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి హైకోర్టు వాయిదా వేసింది. జీవో 1 సవాల్ చేస్తూ హైకోర్టులో సీపీఐ రామకృష్ణ (CPI Ramakrishna) పిటిషన్ దాఖలు చేశారు. ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులను కాలరాసేలా జీవో 1 ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. జీవో 1ను కొట్టివేయాలంటూ న్యాయస్థానాన్ని రామకృష్ణ అభ్యర్థించారు.